Ad Code

సాలగ్రామ - Salagram

సాలగ్రామ

సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే, ఇది ఓ పురుగువల్ల.. అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి నర్మదానదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి.

ఈ గండకీనది తీరంలో "ముక్తినాథం" పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు. సంస్కృతంలో "శిలగా మారిన శలభమే సాలగ్రామం" అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి. ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది.

అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది.
రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి.
గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది. సాలగ్రామం విశిష్ట శిలారూపం.
ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది. సాలగ్రామం సంపాదించి, దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది.

దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి.
సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.





Post a Comment

0 Comments