పంచబ్రహ్మస్వరూపిణి (అష్టాక్షరి)
ఇది ఎనిమిది అక్షరాల మంత్రము. పూజాసమయంలో "పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
పంచబ్రహ్మ స్వరూపిణీ = పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు స్వరూపముగా గలది శ్రీదేవి.
వెనుకటి మంత్రంలో పంచబ్రహ్మలు దేవిలో విలీనత పొందే స్థితి తెలుప బడింది. ఈ మంత్రములో పంచబ్రహ్మలు మరల దేవినుండి ఉద్భవించే అవస్థ బోధింపబడుతున్నది. సువర్ణ నిర్మితాలైన ఆభరణాలు అన్నియును సువర్ణ రూపములే అగును. అటులనే దేవినుండి నిర్గమించిన పంచభూతాది నాయకులైన పంచబ్రహ్మలు దేవీ రూపములే అగుదురు.
“యద్వికారః తద్రూప ఏవ” (శాస్త్రము)
సర్వము దేవి రూపమే అని గ్రహించడం వలన సాధకునికి రాగద్వేషాలు అంతరిస్తాయి. జ్ఞానసిద్ధియు, మోక్షసిద్ధియు ప్రాప్తిస్తాయి.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments