గోదావరి పులస చేపకు ఎందుకంత డిమాండ్
నా పేరు పులసండి
సముద్రాలు ఈదుకుంటు గోదావరి వరద నీరుకు గోదావరిలోకి వస్తానండి, నేను యమ పిరుమండి బాబు, నా మీద ఒక సామిత కూడ ఉందండి ఆయ్, గోదావరి ప్రజలు పుస్తెలు తాకట్టు పెట్టి అయిన పులస తినాలని అంటారండి నా గురించి గోదావరి రేవులో జనం నాకోసం కోట్టుకు సత్తారండి బాబు అన్నట్టు మీకు ఒక్కటి చేప్పాలండి ఆయ్ ఇలస ని కూడ పులస అని నా పేరు చెప్పి అమ్మెతారండి బాబు జగత్తాండి బాబు నేను సముద్రంలో ఉన్నప్పుడు ఇలసండి, మరి గోదావరిలోకి వచ్చాక నా రంగు మారుతుంది. నేను బంగారువర్ణంలో మేరిసి పోతానండి, అప్పుడు పులసంటారండి, సముద్రంలో నా రేటు 200 అండి, మరి గోదావరిలోకి వచ్చకా నా రేటు 4000దాకా ఉంటాదండి. నేను జాలరుల వలలో పడితే వాళ్ళకి ఎంతో ఆనందం. ఇప్పుడు కరోనా వచ్చింది కదండి బాగా కాలుష్యం తగిందండి ఈ సారి గోదారంతా మేమేనండి, గోదావరి ఎర్రనీరు కి మాకు సంతానం కల్గుతుందండి, నన్ను మాములుగా వండకూడదండి ఆయ్
కట్టెలు పోయ్య మీద మట్టిదాక పెట్టి కోచెం నూని పోసి పచ్చిమిరప కాయలు కోంచెం కరెపాకు జిలకర్ర వేసి కోంచెం వేగాక ఉల్లిపాయ పెస్టు వేసాక కోచెం పసుపు బాగ వేగాక అల్లం వెల్లులుపాయ పెస్టు బాగా వేగాక కోంచెం ఉప్పు కోంచెం కారం తరువాత నన్ను వేయలండి తరువాత కోంచెం వేన్నపుస ఆవకాయ నూనె పోయ్యలండి 10 నీమిషాలు తరువాత చింతపండు పులుసు పోయ్యలండి ఒక 2గంటలు తరువాత బెండకాయలు వేయ్యలండి ఒక గంట తరువాత కోంచెం మసాల కోత్తిమీర వేయ్యలండి ఇంక నేను రెడిఅండి (సన్నమంట పెట్టలండి మర్చిపోకండి) నన్ను ఆమాపు అలావదిలెసి మరునాడు తింటె ఉంటాదండి జిమ్మఅట్టెదండి బాబు ఆయ్ ఉంటానండి.
0 Comments