Ad Code

పంచప్రేతాసనాసీనా (అష్టాక్షరి) - Ashtakshari

పంచప్రేతాసనాసీనా (అష్టాక్షరి)



ఇది అష్టాక్షరములు గల్గిన మంత్రము. పూజాసమయంలో “పంచప్రేతాసనాసీనాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

పంచ - ప్రేత - ఆసన - ఆసీన = అయిదు చైతన్య హీనములైన వాటి యందు ఆసీనురాలు శ్రీదేవి.
పంచభూతాలకు, పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడ పంచభూతాలతో లీనమైపోతారు. అందుచేతనే మరణించిన వారిని పంచత్వము పొందినారు అంటారు. ఇదంతయు మహేశ్వరుడు మహాకల్ప కాలంలో మహా తాండవనృత్యం చేయగా జరుగుతుంది. అప్పుడు శ్రీదేవి మాత్రమే ప్రేతాసనాసీనయై మహాతాండవ సాక్షిణియై ఉంటుంది. అమ్మగారు మందహాసం చేయగానే మరల చైతన్యాన్ని పొందుతారు.

ఈ మంత్రంతో దేవిని అర్చించే వారికి సృష్టి తత్త్వం అవగతమై, శరణాగతి భావం ధృఢమౌతుంది. అమ్మ కరుణచే తరిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.







Post a Comment

0 Comments