Ad Code

దైవం ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు?

దైవం ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు?



సముద్రంలో కెరటాలు ప్రతి క్షణం కోటానుకోట్ల పడుతుంటాయి, మరల అందులోనే కలిసిపోతుంటాయి. ప్రతి కెరటం యొక్క pattern ప్రత్యేకంగా ఉంటుంది. దేని ప్రత్యేకత దానికుంటుంది. సముద్రం ఎలా ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది దాన్ని చూడాలని ఉంది అని ప్రతి కెరటం అనుకుంటుంటుంది. కానీ ఆ కెరటానికి తెలియదు అది ఆ సముద్రంలోని ఉందని.

అలాగే దేవుడు ఎక్కడ వున్నాడు,ఎలా ఉంటాడు నేను చూడాలి అనుకుంటూ ఉంటాము. సముద్రం ఎలా వుందో అలాగే అనంత బ్రహ్మాండ మూల చైతన్యంలో మనము అలానే ఉన్నాము.

ఒక లోకంలో జన్మని కొనసాగించి అనుభవాలు గడించి, మరో లోకంలో జన్మ తీసుకుని అక్కడ అనుభవాలు గడిస్తూ అలా అనంతమైన లోకాలలో మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మన ప్రయాణానికి ముగింపు ఎప్పుడూ ఉండదు.

మన పిల్లలకు మనం జన్మ ఇవ్వగలమే కానీ వారికి ప్రాణశక్తి మనం ఇవ్వలేదు. ఆత్మ జన్మ తీసుకునేటప్పుడే ఆనంతమూల చైతన్యం నుండి ప్రాణశక్తి పొందుతుంది.





Post a Comment

0 Comments