Ad Code

జాతకంలో పితృ దోషం

జాతకంలో పితృ దోషం



మనలో చాలా మంది కుటుంబాలలో వారు పాపం ఎంత మంచిగా ధార్మికమైన జీవనం గడుపుతున్నా ఎన్నో కష్టాలు అనుభవిస్తు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగా ఒకటి తీరిపోతే వెంటానే ఇంకోటి అలా ఎన్నో సమస్యలు చదువులో ఆటంకాలు, పెళ్లిళ్లు అవ్వకపోవటం, పిల్లలు పుట్టక పోవటం, విపరీతమైన అప్పులు, అంతులేని రోగాలు, ఆత్మహత్య లు, ప్రమాదాల్లో మరణించడం. ఇలా చెప్పుకుంటుపోతే ఎన్నో ఉంటాయి.

వీటికి ప్రధాన కారణం మన పూర్వీకులలో తల్లి లేదా తండ్రి తరపున ఎవరో ఒకరు లేదా కొంతమంది. ప్రమాదాల్లో మరణించడం, హత్య చెయ్యబడటం, ఆత్మహత్య చేసుకోవటం, ఏవైనా అనుకోని ప్రమాదాల్లో మరణించడం (ఎంత మంది అయితే అంత మంది లెక్క సరిగ్గా చూసుకోవాలి) మొదలైన వాటి వల్ల వారు ఇంకో శరీరంలోకి వెళ్ళటానికి కుదరదు కనుక వారు వారి విముక్తి కోసం వారి వంశంలో వారికి ఈ విధంగా తెలియచేస్తారు, కష్టాలే ఎందుకు ఇస్తారు అంటే సుఖాలు ఇస్తే మనం ఎవరి దగ్గరకి పరిగెత్తం కనుక,  అలాగే మనకి ఒక సంవత్సర కాలం వారికి ఒక రోజు కనుక మనం కొన్ని తరాలుగా ఇబ్బంది పడుతుంటాం.అలానే వారి వంశంలో శని,కేతు యుతితో కొందరు జన్మిస్తారు అని కొంతమంది అంటారు వారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి వీరికి ఎదో మార్గం చూపిస్తారు అని ఆశ పడతారు అంట. జాతకంలో శని, కేతు యుతి ఉన్న ఆలోచించాల్సిన విషయమే ఎన్నో ఇంట్లో ఉంది దాని ప్రభావం ఏంటి ఇవి తెలుసుకోవాలి. మన పెద్దలే మనకి డబ్బు,మనఃశాంతి, హోదా మొదలైనవి ఇస్తారు కనుక వారికి విముక్తి కలిగించడం ద్వారా మన కష్టాల నుండి బయటపడవొచ్చు. దీని గురించి స్కాంద పురాణం, పద్మ పురాణలలో దీని ప్రస్తావన ఉంది.అలాగే గరుడ పురాణం 40వ చాప్టర్ లో కూడా దీని గురించి వివరించారు.

నారాయణ బలి:
దీనికి పరిహారంగా నారాయణ బలి అని ఒక కార్యక్రమాన్ని చెయ్యటం అనేది ఉంది.ఇది మన హిందు ప్రేత సంస్కారంలానే చేస్తారు. కొంత మంది సర్ప హత్యకి కూడా ఈ క్రతువు చేసుకుంటారు. ముఖ్యంగా నది తీరాల్లో 3 రోజులు చేస్తారు. అలాగే గోకర్ణ క్షేత్రంలొనే చెయ్యాలి అని కొందరు అంటారు.

కానీ అంత పెద్ద పెద్ద వి చెయ్యలేని వారికి సులభమైన పద్దతి కూడా ఉంది అవి చేసుకున్నా సరిపోతుంది. అవి తెలుసుకుని చేసుకోండి.

అలాగే మన పెద్దలకు ప్రతి సంవత్సరం తిధి చెయ్యటం, ప్రతీ అమవాస్యకి మధ్యాన్నం 12 గంటలకి కాకకి ఆహారం పెట్టడం మొదలైనవి చేసి పితృ దేవత అనుగ్రహం పొందండి.

ఎన్ని పూజలు, వ్రతాలు, హోమాలు, జపాలు చేసినా ఫలితం రావట్లేదు అంటే మీ ముందు తరం వాళ్ళ గురించి తెలుసుకోండి, ఏమైనా ఉంటే పరిహారం చేసుకోండి. సుఖంగా ఉండండి.

సర్వేజనా సుఖినో భవంతు





Post a Comment

0 Comments