మనిషి తన చేసే ప్రతి పని ఏదో స్వార్థ పూరిత కోరికను కోరి, ఫలితాన్ని ఆశించి మోసపోతున్నాడు. సత్ఫలితం అందిన, నా అంతవాడు లేదని అంటాడు. ప్రయత్న విఫలమైన, అక్కడికక్కడే చతిగల పడి పోతాడు. అదియే ప్రతి మానవుడు చేసే అతి పెద్ద తప్పు.
అలాకాక నీ కర్మనును నీవు ఆచరింపుము. ఎటువంటి ఫలితాన్ని ఆశిoచక, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అంతే అని ఏ కార్యమైన చేసి చూడుము. నీవు పొందే తృప్తి, అంతకుమునుపు పొందిన జయము వలన కలిగిన తాత్కాలిక సంతోషము, అపజయము వలన కల్గిన / లభించిన దుఃఖము కన్నా అతి గొప్ప సంతృప్తిని నీవు పొందుతావు. నిజమైన ఆనందాన్ని పొందుతావు. అదియే అసలైన ఆనందం.
బందాలను ఎప్పుడూ పట్టించుకోకు అవి ఎప్పుడూ దుఃఖాలనే మిగి లిస్తాయి. అందుకని, నీ ధర్మాన్ని మాత్రం నిర్లక్ష్య పరచకుము. కర్తవ్య నిర్వహణ ప్రధానం. నాకై, నావారికై, అని ఏ కార్యము నిర్వర్తించకుము. అప్పుడు నీకంతా ఆనందమయమే. అన్నీ భగవంతుడే చూచుకుంటాడు. నీవుగా నాది, నేను అని చేసినంతకాలం భగవంతుడు తన క్రీగంట కూడా చూడడు.
బంధాలన్నవి వాటంతటకు అవే వచ్చి నిన్ను చేరవు, నీవే క్షణ క్షణము పెంపొందించు కుంటున్నావు. అతుక్క పోతున్నావు, ఆశా మోహములను కల్గించుకొంటున్నావు, ఒక్క సారి అనాశక్తి తో నిర్లిప్తంగా ఉండి చూడుము. ఏదీ నీవద్దకు రావటానికి ఇష్టపడదు. అపుడు నీకు ఏ బంధాలు, బంధనాలు, సంబంధాలు నిన్ను కట్టపడివేయవు.
0 Comments