Ad Code

చంద్రమండలమధ్యగా (అష్టాక్షరి) - Ashtakshari

చంద్రమండలమధ్యగా (అష్టాక్షరి)



ఇది అష్టాక్షరముల మంత్రము. ఈ మంత్రమును పూజా సమయంలో “చంద్రమండల మధ్యగాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

చంద్రమండల - మధ్యగా = చంద్రమండలము యొక్క నడుమ ఉండునది శ్రీదేవి.
దీని వివరణ కొంత “చంద్రవిద్యా" అనే పూర్వ మంత్రంలో తెలుపబడింది.

"సహస్రార పద్నే శిశిరమహసాం బింబమపరం" అనే శాస్త్రాన్ని అనుసరించి ఈ చంద్ర మండలం సహస్రార పద్మమునకు పైన ఉంటుంది. ఇదియే చంద్రాగ్నుల సంధిస్థానం అందురు. కుండలినీ శక్తి - రుద్రగంథిని ఛేదించుకొని ఇందు చేరగానే, ఇది ద్రవించి అమృత వర్షం కురుస్తుంది. దీనినే ప్రకృతిపురుషుల మేళనస్థానం అనియు వచిస్తారు.

ఈ మంత్రంతో దేవిని ఉపాసించే సాధకులు, సుధాసార ప్లావితులై శాంతి సౌఖ్యాలను అనుభవిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.







Post a Comment

0 Comments