Ad Code

అఖిల జగన్మోహిని

అఖిల జగన్మోహిని



యుగారంభం నుండి యుగాంతం వరకూ అనుకూల దశలో నడిపించే  అమ్మ పావన స్పర్శ మనకు ఏకైక లక్ష్యం కావాలి.

అమ్మ సర్వతోముఖ ప్రకాశంలోనే సర్వగుణ సంపన్నతలూ సాక్షాత్కారిస్తాయి. సర్వ ప్రపంచమూ అమ్మ గతిస్థితులలో నిహితమై ఉంది.

చతుర్దశ భువనాల ఐశ్వర్య విస్తారమూ శ్రీదేవి చలువే,  శ్రీలక్ష్మి చతురతను వర్ణించలేం అమ్మ గుణాల పుణ్యకీర్తి భక్తులకు మాత్రమే చేరువవుతుంది.

అమ్మ వాత్సల్య రసవర్షం అక్షయం ఒక్కసారి నిండు భక్తితో శ్రీమయివైపు అడుగువేస్తే సమస్త బాధలూ వాటంతటవే తొలగిపోతాయి.

శ్రీదేవి ఆరాధకులకు పరాజయం ప్రశ్నేలేదు, అనంత వైభవాల విష్ణు కాంతికి వెనుక ఉన్న ఈ ప్రకాశమే జగత్తుని పులకితం చేస్తుంది.

అమ్మ వైభవ రూప దివ్యదర్శనానికి శుభ శుక్రవారము వేళ  శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమే సర్వశ్రేష్ఠ సాధనం.

శ్రీమంతులలో శ్రేష్టుడైన శ్రీనివాసుని వక్షస్థలంపై స్థిరనివాసంతో శోభించే శ్రీమహాలక్ష్మి దేవిని ప్రతి శక్రవారం పవిత్ర స్తుతి పఠనంతో అమ్మను ప్రసన్నం చేసుకుందాం.





Post a Comment

0 Comments