Ad Code

చారురూపా (చతురక్షరి) - Chaturakshari

చారురూపా (చతురక్షరి)


ఇది నాల్గు అక్షరాలు గల్గిన మంత్రము. పూజా సమయంలో “చారురూపాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

శ్రీదేవి చాలా అందమైనది. ఈ అందం కేవలం శారీరకంగానే గాక, అంతరంగాను ఉంటుంది. ఏలననగా ఆ కరుణామయి తల్లికి సుగుణాల వల్లనూ అందం వస్తుంది. ఇక శారీరకంగా శ్రీదేవి నిత్య షోడశ వసంతాల బాలకుమారిగానే ఉంటుంది. “నిత్యా షోడశికా రూపా” (లలితా సహస్రనామము).

ఆ తల్లి దేహము నవరత్న ద్వీపము. జ్ఞాతృ, జ్ఞాన, జేయముల యొక్క అభేద రూపమైన శ్రీచక్ర స్థితి గలది.

“దేహో నవరత్న ద్వీపం” (శృతి)

"జ్ఞాతృ జ్ఞాన జేయానాం అభేదభావనం శ్రీచక్ర పూజనమ్” (భావనోపనిషత్)

ఈ ఉపనిషణ్మంత్రాలకు ఇతరములైన అర్థాలును గలవు. ప్రస్తుతార్థలకై మాత్రం ఉల్లేఖించబడినాయి.

“హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీమ్”

బంగారువన్నె గలదియు, నవరత్నఖచితములు అయిన అపరంజి భూషణములు భరించేదియునై శ్రీదేవి భాసిస్తూ ఉంటుంది. అర్చించే భక్త జనులనే గాక సర్వ చరాచరములనుపుతుంది. వీక్షణ మాత్రమున సమస్త సంపదలను అనుగ్రహిస్తుంది. ఇట్లు సర్వ విధాలుగాను కాపాడుతుంది. "చారురూపా” అయినది శ్రీదేవి.

ఈ మంత్రముతో శ్రీదేవిని ఉపాసించే వారికి బాహ్య - అంతర సౌందర్యాలును, సర్వ శుభాలును ప్రాప్తిస్తాయి.







Post a Comment

0 Comments