శనీశ్వరుడి అనుగ్రహం సులభంగా ఎలా పొందాలి
మీరు శనిని ఎప్పుడూ తిట్టడం, ఊతపధంగా వాడడం చేయకండి అది చాలా అనర్దాలకి దారి తీస్తుంది.
చాలా మంది జీవితంలో సక్సెస్ కాలేకపోవటానికి కారణం బద్దకం, వాయిదా ఈ రెండిటి చేతనే శని పీడిస్తాడు (రోగాల గురించి మళ్ళీ మాట్లాడదాం).
మనలో చాలామందికి అసలు వాళ్ళకి బద్దకం ఉందనే ఒప్పుకోరు ఇతరులు చెప్పినా వినరు నేను ఎంత పని చేసేస్తున్న అనుకుంటారు అలా అనుకునేల చెయ్యటం, పావుగంట పనికి రెండు గంటల విశ్రాంతి తీసుకోవటం ఇవన్నీ శని ప్రభావ లక్షణాలు శనిని శాంత పరచాలి ఆయన అనుగ్రహించాలి అంటే కచ్చితంగా శారీరక కష్టం చెయ్యవలసిందే అలాగే మీరు చేసే చిన్న చిన్న పనులను కూడా శ్రద్ధతో చెయ్యండి అంటే చెప్పులు, షూ లు విసిరి కొట్టడం, బండి తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం ముసలి వాళ్ళని అవమాన పరచడం( ముసలి వాళ్ళు శనీశ్వర స్వరూపులు) వాళ్ళకి సేవ చేస్తే మీరు ఏ గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు), అన్నాన్ని గౌరవభావం తో తినకపోవటం, ఎంగిలి చేతితో వేరే పనులు చేయటం మల,మూత్ర విసర్జనకి వెళ్ళాక కాళ్ళు కడుక్కోక పోవటం ఇలా చెప్పుకుంటూ పోతే మనమ్ ఉదయం లేచిన దగ్గరనుండి పడుకునే వరకు చాలా చాలా జాగ్రత్తగా ఒక క్రమంలో మన పనులు చేసుకోవటం ( మీకు ఒక సందేహం రావొచ్చు కష్ట పడకపోయినా రాజయోగం ఉన్నవాళ్లు ఎలా అని, వారి సంఖ్య తక్కువగా ఉంటుంది పూర్వ జన్మ పుణ్య ఫలాన్ని అనుభవిస్తున్నారు, ) మీ జాతకంలో పూర్వ పుణ్యం ఉన్న లేకపోయినా నేను చెప్పినవి మీరు చెయ్యండి కచ్చితంగా ఇప్పుడు ఉన్న మీ స్థితి మారుతుంది. సమయపాలన, నిజాయతీ, మోసం చెయ్యకపోవటం, ప్రతి పనీ శ్రద్దతో చెయ్యటం, ముఖ్యంగా శరీరాన్నీ కష్టపెట్టడం ( అంటే బెల్టు తీసుకుని బాదేసుకోమని కాదు) మన పనులు మనం చేసుకోవటం ప్రతిదానికి ఇంట్లో వాళ్ళకి ఆర్డర్స్ వెయ్యకుండా ( అమ్మా గ్లాసు నీళ్లు, అమ్మా కాఫీ, అమ్మా స్నానాన్నికి నీళ్లు ఇలా) ఉండటమే.
మనలో ఉత్సాహమే శనీశ్వరుని అనుగ్రహం, బద్దకమే శని పీడ అంతే. నిజాయతీగా ఇంట్లొగాని బయటగాని ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు ( కూలీలు, శ్రామికులు, పనిచేసే కొడళ్లు, పనిచేసే అత్తలు, వంట వారు , పని మనుషులు) మొదలైన వాళ్ళు ఉంటారో వారిని చీటికీ మాటికి నిందించడం మోసం చేయటం ( ఇందులో చెప్పిన అత్త కోడళ్ల గురించి వేరొక పోస్ట్ పెడతా) చేస్తారో వారికి ప్రస్తుతం బాగానే ఉన్నా ఏలినాటి శని వచ్చినప్పుడు వారి పాపాలకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరూ తప్పించుకోలేరు. ( వీటి వల్ల వచ్చే రోగాలు, బాధలు ఎంత భయంకరంగా ఉంటాయి తెలిస్తే భయం వేస్తుంది) అప్పుడు ఏడ్చి ఏడ్చి గుళ్ళు గోపురాలు, జ్యోతిష్కుల చుట్టూ తిరిగినా ప్రతి శనివారం శనికి తైలాభిషేకలు చేసి ప్రదక్షిణలు చేసినా ఎప్పుడో అప్పుడు కాలుజారి కిందపడి నడుము విరగొట్టుకోవటం తప్ప ఏమీ ఉపయోగం లేదు. శనీశ్వరుడి అనుగ్రహం కోసం ముందుగా మీకున్న బద్దకాన్ని వదలండి. ప్రతిరోజు వీలైనంత ఎక్కువ దూరం నడవండి (కాళ్ళు శనీశ్వరుడికి సంబంధించినది)
శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి ముసలి రోగులకు సేవ చెయ్యండి.
మీ కింద పనిచేసే వారిని గౌరవంగా చూడండి వారికి బట్టలు పెట్టడం పనికి విలువ ఇచ్చి సంవత్సరానికి ఒకసారి బోనస్ ఇవ్వటం చెయ్యండి.
ప్రమాదవశాత్తు శరీరంలో చర్మం కాలిపోయిన వారికి సహాయం చేయటం ( బీదవారికి) కాళ్ళు కి పోలియో వచ్చి నడవలేని వారికి ఐరన్ తో చేసిన కాళ్లు లేదా చక్రాల కుర్చీ లేదా చక్రాల బండి దానం చెయ్యటం.
హిజ్రాలను తిట్టడం అవమానించడం చెయ్యకండి వీలైతే సహాయం చేయండి ( నిజమైన , నిజాయతీ కలిగిన వారి గురించి)
ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు నాటుకోడిని చంపి తిన్నా కూడా చాలా దోషం.
ఇలా రాసుకుంటూ పోతే చాలా వస్తుంది ప్రస్తుతానికి ఇది చాలు. పాటించి చూడండి మీ జీవితంలో జరిగే మార్పులకు మీకే ఆశ్చర్యం వేస్తుంది మా గురుదేవుల భిక్ష ఇది.
అనవసరంగా అక్కడా ఇక్కడా తిరిగి మీ సమయాన్ని,డబ్బుని వృధా చేసుకోకండి.
0 Comments