Ad Code

కుంకుమను ఎందుకు ధరించాలి? - Why to wear Kumkum or red dot on forehead?


కుంకుమను ఎందుకు ధరించాలి?



కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. స్త్రీ పురుషులిద్దరకు సంబంధించినది. కుంకుమ పెట్టుకోవడం హిందూ సంప్రదాయం. అన్నీ కులాల హిందువులు, శైవ,వైష్ణవ మతస్థులు అందరూ కూడ కుంకుమ నొసటిన ధరించటం గొప్పతనంగా భావిస్తారు.

కుంకుమ ఆస్తికత చిహ్నం. ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూమతస్థులందరు తప్పనిసరిగా కుంకుమను నొసటిన దిద్దుకునే ఆచారం బలంగా ఉండేది. ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా ఉండేది.హరిచందనాన్ని, మంచి గంధాన్ని,విభూతిని కూడా నొసట ధరించటం హిందూసాంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు పూర్వీకులు.

రెండు కనుబొమ్మల మధ్య భాగంలో నుదిటి వద్ద ‘ఇడ’ ‘పింగళ’ అనే నాడులు కలిసి ‘సుషుమ్న’ నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకుంటాం. ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టి దోషం తగలకుండా కూడా ఉంటుందని ఒక నమ్మకం ఉంది. మరొకటేమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారన్న వాదన కూడా ఉంది. ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగతత్త్వాన్ని, నిర్భయత్వాన్ని, పరోపకారగుణాన్ని కలిగిస్తాయని ఒక థియరీ కూడా ఉంది. కుంకుమ ధరించటం పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికీ, స్థిరబుద్ధికీ సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్చినదగ్గరనుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్టు కొన్ని గ్రంధాల్లో కూడా ఉంది.

భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికీ అందంగా కనిపించకూడదన్న ఉద్దేశంతో కుంకుమ ధారణను త్యజిస్తారు. కుంకుమ భారతీయతకు చెరగని ముద్ర. పాశ్చాత్య నాగరికత మనమీదకు దాడిచేసిన తర్వాత పురుషులందరూ కుంకుమధారణ మరిచిపోయారు. ఇటీవల కాలంలో అయితే స్త్రీలు కూడా కుంకుమ ధరించటం మర్చిపోతున్నారు.


Why to Apply Kumkum

The holy red dot on the forehead

It is a custom of Hindu Tradition and Culture to wear Bindi or Bottu or a bright red dot on the forehead. Wearing kumkum on forehead is a holy gesture and its shows devotion towards Gods and Goddesses. We normally see priests, all Hindu women, especially married women wearing kumkum on their foreheads. Though some people apply kumkum on the throat and high on the forehead, the place above eye brows is the common place for wearing Bindi or Bottu or Tilaka.

Wearing kumkum on the forehead is called as Pundradhaarana or Thilaka Dhaarana.





Post a Comment

0 Comments