అక్షయ తృతీయ విశిష్టత
శ్రీ మహా లక్ష్మి అమ్మ వారు
అక్షయ తృతీయ విశిష్టత, పూజ చేసే విధానం, పూజానంతర ఫలితాలు
అక్షయ తృతీయ పండగ మన హిందువుల్లోనే కాకుండా జైనులలో కూడా చెపుకోతగ్గ పెద్ద పండగ. ఈ పండగ ముఖ్యముగా హిందువుల చంద్రమానకాల పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్ష2020లో అక్షయ తృతీయ ను ఏప్రిల్ నెల 26వ తారీఖున జరుపుకోవాలని పెద్దల నిర్ణయం.
అక్షయం అంటే?
సంస్కృతంలో “అక్షయం” అంటే నాశనం లేనిది లేదా అనంతమైనది అని అర్ధం స్ఫురిస్తుంది. ఈ అక్షయ తృతీయ ను సర్వసిద్ది ముహూర్తం గా చెప్పుకోనవచ్చంటే ఎంత పవిత్రమైన దినమో కదా! ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్దిస్తుందని పండితులు మరియు పెద్దలమాట.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం “అక్షయ తృతీయ” నాడు చాలా మంది బంగారం, భూములు, అపార్ట్మెంట్లు కొనుగోలు విరివిగా చేస్తుంటారు. అయితే పండితులు మాత్రం ఇలా ఐశ్వర్యాన్ని పొందగోరి అప్పుల పాలు కావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐశ్వర్యాన్ని అందుబాటులో ఉన్న నిధులతోనే కొనుగోలు చెయ్యాలని అప్పులతో కాదని గ్రహించాలి.
అక్షయ తృతీయ విశిష్టతలు:
మన పురాణాలు, పండితులు చెబుతున్న అక్షయ తృతీయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.
వాటి వివరాలు
ఈ రోజే మహా విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జననం.
ఈ పవిత్ర దినానే త్రేతాయుగం ప్రారంభమైనదని పండితుల మాట.
గంగమ్మ భువి పై ఉద్భవించిన రోజు ఈ రోజే.
అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి “మహాభరతం” పవిత్ర గ్రంధాన్ని రచన ప్రారంబించిన రోజు.
ఈ రోజే అమ్మ “అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు.
అక్షయ తృతీయ పవిత్ర దినాన్నే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింపబడ్డాడు.
శ్రీకృష్ణుడు ద్రౌదపదిని దుస్సాసన నుండి కాపాడిన దినం.
శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి అపార సంపదను అనుగ్రహించిన రోజు.
సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు “అక్షయపాత్ర”ను ఇచ్చినరోజు.
ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ద జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి “కనకధారాస్థవం” స్తుతించిన రోజు.
ఈ పవిత్ర దినానే, దివ్య క్షేత్రం “బద్రీనాథ్” ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత, పునః దర్శనార్ధమై తెరుచుకోబడతాయి.
ఏఏటికాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.
ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.
బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.
అక్షయ తృతీయ పూజ విధానం:
ఇంట్లో ఈశాన్యం మూలలో పసుపుతో అలికిన పీటను వేసి ఎర్రటి వస్త్రాన్ని పరుస్తారు.
లక్ష్మీ, నారాయణుల విగ్రహాలను అమరుస్తారు. లక్ష్మీ దేవి విగ్రహం నారాయణుని ఎడమ పక్క ఉండేట్లు అమర్చాలి. కొందరు లక్ష్మీ, కుబేరులను కూడా పూజిస్తారు. ఈ సందర్భంలో కుబేరునకు కుడి ప్రక్కన లక్ష్మీ దేవిని పెట్టి పూజించాలి. కుబేరుడు సర్వదేవతలకు కోశాధికారిగా కీర్తింపబడ్డారు.
వెండి దీపాలు లేదా ఇతర లోహపు దీపాలు లేదా ప్రమిదలలో ఒత్తులువేసి, ఆవు నేతితో కానీ, నూనెతో కానీ దీపాలను వెలిగించాలి. అగరబత్తిలను వెలిగించాలి.
పూజ సమయంలో పసుపు, కుంకుమ, అక్షతలను భగవంతునికి సమర్పించాలి.
లక్ష్మీ, నారాయనులను మీ శక్తి మేరకు అష్టోత్తరాలను లేదా సహశ్రం చదివి, గృహానికి ఆహ్వానించి, నైవేద్యాన్ని స్వీకరించమని ప్రార్ధించాలి.
పూజకు ముందు కొబ్బరి కాయ, పండ్లు, ఆకు చెక్కలను పీటపై నైవేద్యంగా ఉంచాలి.
నైవేద్యాన్ని సమర్పించిన పిమ్మట లక్ష్మీనారాయనుల ఆశ్శీస్సులు కోరుకోవాలి.
చివరిగా గంట కొట్టి హారాతినివ్వాలి.
అక్షయ తృతీయ (నాడు ఇలా చేస్తే) పూజ ఫలితాలు:
అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం చేస్తే అనేక రెట్లు వృద్ది చెందుతుందని విశ్వాసం.
ఈరోజు దానాలను చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశించి దానగుణ సంపన్నుడుగా కీర్తి గడించగలరు.
ఈరోజు శంఖం ఇంటికి తెస్తే ఎంతో మంచిదట. ప్రతి పూజ ముగిసిన తరువాత శంఖం పూరించాలట.
ఈరోజు పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే మంచి జరుగుతుందట. రోజూ పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయట.
ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చి పూజిస్తే విశేష ఫలితాలు దక్కుతాయట. గవ్వలకు లక్ష్మీదేవి దృష్టి ఆకర్షించగలిగే శక్తి ఉందట. వీటిని పసుపు, కుంకుమలతో పూజించాలట.
ఉపవాస దీక్షను ఆచరించి లక్ష్మీనారయనులను పూజిస్తే మంచిదని పెద్దల మాట.
ఈరోజు బంగారం వంటి వస్తువులను కొనటం ద్వారా సంపద సమృద్ది చెందుతుందని విశేష నమ్మకం.
అక్షయ తృతీయ నాడు జన్మించిన పరశురాముని పూజించటం మేలు చేస్తుందని పండితుల మాట.
ఈరోజు చందనం దానం చేయడం ద్వారా గృహాల్లో జరిగే ప్రమాదాల నుండి రక్షింపబడతారాట.
చదువులో పిల్లలు విజయం సాధించటం కొరకై ఈరోజు మజ్జిగ దానం చేస్తే మంచి జరుగుతుందట.
ఈరోజు నూతన వస్త్రాలను లేదా పాతవస్త్రాలను బీదలకు దానం చేయటం ద్వారా మీకు మరియు మీ కుటుంబ సభ్యలకు ఆయురారోగ్యాలు చేకూరతాయట.
ఈరోజు జంతువులకు ఆహారం వేయటం ద్వారా వాటి ప్రేమను యజమానికి రెట్టింపు చూపిస్తాయట.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్ళ జోరు:
ఈ పర్వ దినాన ప్రజలు కొత్త పని ఏది ప్రారంభించినా అద్భుత ఫలితాలు దక్కుతాయని విశ్వాసం. అందుకే వేలం వెర్రిగా కొత్త ఆస్తులు, కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యడం చేస్తారు. మహిళల్లో బంగారం కొంటే లక్ష్మీదెవి తమతోనే ఉంటుందని నమ్మకం. అందుచే అక్షయ తృతీయ నాడు ఎంతోకొంత బంగారం కొనేందుకు జనం ఎగబడతారు.
ఈరోజు మహలక్ష్మీ బొమ్మతో ఉన్న కాసులు(Coins), బొమ్మల బిళ్ళలు ను(Dollars) విరివిగా కొనడం తమకు అదృష్టాన్నిస్తుందని పలువురి నమ్మకం.
అక్షయ తృతీయ సందర్భంగా పలు వ్యాపారసంస్థలు తమ వ్యాపారకూడళ్ళను చూపరులను ఆకట్టుకొనే విధంగా అలంకరించి, అందమైన డిజైన్లతో నగలను ప్రదర్శనతో పాటూ, తరుగులో డిస్కౌంట్లు ఇస్తూ మరియు ఇతర ప్రోత్సాహకారాలతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తుంటారు. అక్షయ తృతీయతో పాటూ పెళ్ళిళ్ళ సీజన్ కారణంగా బంగారం/జ్యూయెలరీ వ్యాపారం సమృద్దిగా జరుగుతుందని వ్యాపార వర్గాల భోగట్టా.
According to Hindu mythology, the day is also celebrated as the birth anniversary of Parashuram, an avatar of Lord Vishnu. The day of his birth also marked the beginning of Treta Yuga.
Some beliefs also say that Goddess Ganga arrived on Earth from heaven on this day.
Devotees worship Lord Vishnu, who is among the holy trinity of Hindu gods, on Akshaya Tritiya. Vishnu is regarded as the preserver in Hindu mythology.
People also offer prayers to Goddess Annapoorna, the deity of food and nourishment.
Significance of Akshaya Tritiya
The word Akshaya means something that never diminishes. This is the reason why people buy gold on this day, believing it will never diminish and help them prosper.
Various other events like marriage and holy thread ceremony take place on Akshaya Tritiya.
Gold and Akshaya Tritiya and intrinsically linked but the demand for the precious metal has fallen because of record high prices and slowing growth. Most jewellery stores are closed due to coronavirus lockdown but they are counting on online purchases on Akshaya Tritiya.

0 Comments