Ad Code

ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భొజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ? - What type of food we are should eat and What type of food we are not eat

ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భొజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?



• కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు.

• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు.

• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు.

• భార్యతో కలిసి తిన కూడదు. భర్త భుజించిన తరువాత భార్య తినాలి. కలిసి తినాల్సివస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసితినవచ్చు.

• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు.

• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.

• నిలువ పచ్చళ్ళు చిన్న వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో ఉన్నవారు వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం.


• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.


• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.


• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది.


• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి.


• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.


• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి.


• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి. అన్నమునకు నమస్కరించాలి. అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండిన వార్ని అభినందించాలి.


• అప్పుడే బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది.


• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.


• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.


• రోజుకు రెండుసార్లు భొజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది.


• భొజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి.


• తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భొజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.


• పడమర, దక్షిణం వైపున భొజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి.


• ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భొజనం చెయ్యరాదు.


• ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భొజనం చేయాలి.


• మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.


• భొజనానికి ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.


• తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.



Food habits have played a major role even in the rise and fall of civilizations. Aryans would not have migrated to India in 1500 BC had their lands in Central Asia not fallen short of pastures for their cattle. The simple ‘Mediterranean’ foods that dieticians are tardily recommending us today must have played a great part in the remarkable achievements of the Greeks. Even the small habits that we have grown up hearing like, “don’t go out on an empty stomach, do not talk while eating, do not share glasses, do not chomp are much more than good manners. In fact going back to some of these habits can magically impact our health.
Sitting on the floor while eating: In an age when there were no dining tables, everyone sat on floor while having food and very few suffered from lifestyle diseases that have become so rampant in our times. According to experts, sitting on the floor cross legged while having food as practiced in India is typically a yogic posture called Sukhasan which is said to massage the abdominal muscles, boost circulation in lower part of the body and increase flexibility. So ditching the dining table or couch while having food is not a bad idea!



Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.



Post a Comment

0 Comments