Ad Code

కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ విశేషాలు - Kanipaka Varasiddhi Vinayaka Temple History



కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ విశేషాలు

స్థలపురాణం:
పూర్వం మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గరు అన్నదమ్ములు ఈ కాణిపాక ప్రాంతంలోనే నివసిస్తుండేవారు. వారికి కాణి మడి (భూమి) వుండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్నబావిని తవ్వాలనుకుని నిర్ణయించుకుంటారు. దాంతో వారు ముగ్గురు కలిసి తమకు అనుగుణంగా ఒక చిన్న బావిని తవ్వుకున్నారు. అందులో వచ్చిన నీటితో సేద్యం చేసుకుంటూ హాయిగా బతికేవారు.

కొంతకాలం తరువాత ఆ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీని ప్రభావంతో వారు ముగ్గరు తవ్వుకున్న చిన్న బావిలోని నీరు చాలకపోవడంతో ఇంకా లోతుగా తవ్వాలని అనుకుంటారు. అలా నిర్ణయించుకున్న వారు బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభిస్తారు. అలా బావిని తవ్వగా తవ్వగా కొంతసేపటి తరువాత వారు తవ్వడానికి ఉపయోగిస్తున్న గునపం ఒక రాయికి తగిలి దానినుంచి రక్తం ఉవ్వెత్తున వారి ముగ్గురి చిందింది. ఆ రక్తం వారి మీద పడిన మరుక్షణమే వారికున్న వైకల్యాలు తొలగిపోయి మామూలుగా మారిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలుగా ఆ ముగ్గరు బావి తవ్విన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వున్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారందరికీ వినాయకుని రూపంలో వున్న ఒక విగ్రహం కనిపించింది. ఆ విధంగా వెలిసిన వినాయకుని విగ్రహానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంగా పేరు పొందింది. ఇప్పటికీ ఆ స్వామివారి అంతరాలయం బావిలోనే వుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్నవారికి వినాయకుడు సిద్ధి, బుద్ధుని ప్రసాదిస్తాడని అలాగే తప్పు చేసిన వారికి తగినవిధంగా శిక్షలు వేసి దండిస్తారని ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవ్వరైనా అసత్యాన్ని పలకరు.

సత్య ప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ఈ బొజ్జ గణపయ్య ప్రమాణాల దేవుడయ్య
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది.

నిత్యం పెరిగే స్వామి: వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మహత్యా పాతక నివారణార్థం: స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు: మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.
సర్పదోష పరిహారార్థం. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550
సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.

గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500
సేవాఫలితం: ‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.

గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.

సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58
సేవాఫలితం: ‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.

మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300
సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151
సేవాఫలితం: గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.

పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000
సేవాఫలితం: వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116
సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116
సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51
సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

వసతి రవాణా సౌకర్యాలు: కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా అటు తిరుమల శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

తిరుపతి నుంచి చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు, విమాన మార్గ సదుపాయం అంటే తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.




Sri Varasiddhi Vinayaka Swamy Temple 
History:

The Temple was constructed in the early 11th century CE by the Chola king Kulothunga Chola-I and was expanded further in 1336 by the Emperors of Vijayanagara dynasty.
There is an interesting legend about the sthala purana of this ancient temple which has 1000 years’ history. About 1000 years back, three physically handicapped blind, dumb and deaf persons were eaking their livelihood by cultivating a piece of land near Viharapuri village. On one day two persons were taking out water with the help of a picot and the third person was irrigating the land. After some time, water was exhausted in the well. One person took a spade and hit a stone inside the well and blood started flowing continuously. When the three handicapped persons touched the water mixed with blood, surprisingly they became normal persons. After digging for some time they found an idol of Sri Varasiddi Vinayaka in the well with an injury on the head oozing with blood. They could not take out the idol as it was growing in size, as they were digging. They informed the villagers about this surprising phenomena. People came running with coconuts and other Pooja materials to worship the Sri Varasiddi Vinayaka. They broke thousands of Coconuts, the coconut water was spread to an area of one and quarter acre. In the local language it is called as "Kani". That is how the place was called as "Kanipakam" since then.

Even now we can see the well around Sri Varasiddi Vinayaka idol. Always water is seen around the idol. We can also see the wound on the head of the idol.Another astonishing feature is that the idol is growing in size. In 1947 a devotee Sri Bezawada Siddaiah of Aragonda Gollapalli village presented a Silver Kavacha to the Lord which correctly fitted the idol. Now, it is not fitting the idol. As the idol is growing in size. Always there will be water at the same level around the base of the idol in all seasons. This sacred water is given as theertham to all other devotees.

Kanipakam where Sri Vinayaka Swamy emerged as “Swayambhu” is located by the side of Bahuda River. There is an olden Puranam for calling the River as Bahuda. After the self-elevation of Lord Vinayaka Swamy at Kanipakam, two brothers namely, Sankudu and Likhithudu wanted to have Darshan of Lord Swayambhu Sri Vinayaka and they made their journey by walk. After having Prolix journey, the younger Likhitudu became very tied, hungry and wanted to take mango fruit from the tree, and asked his brother to help him. The elder brother warned him not to take the fruit, since it belongs to the king. But the younger brother who was too tired, hungry and thirsty took the Mango fruit and ate it. The Elder brother Sankudu dragged his younger brother to the king and narrated the theft of fruit committed by his brother and requested to impose punishment. Unfortunately, the king became angry and vehemently ordered to cut off the both hands of the younger brother who had stolen the fruit without permission, and the punishment was implemented.

The Elder brother became very sad for this unfortunate incident which resulted loss of hands of his brother and at last he desired to take a holy bath in the river near the Swayambhu Vinayaka Temple before going to darshan, and when both the brothers immersed in to the river by praying the Lord Vinayaka. Surprisingly, the hands of the younger brother Likhitudu have come out as existing earlier. Then both the brothers have taken the darshan of the Lord Vinayaka Swamy and offered their vows for blessing them. After that, the two brothers propagated the kindness of Swayambhu Sri Vinayaka among the neighbouring villagers. After that the river in which lord Vinayaka gifted the lost hands (Bahuda) to Likhithudu is called as “Bahuda River”.

Resolving disputes: It is believed that people come here and resolve their disputes by taking a "Special Oath". As per rituals the people in dispute take a holy dip in the temple tank and swear before the lord. Here is that if a person swears(Pramanam) about a particular incident, it is taken as 'truth'. Most of the disputes are settled by this method. People take it as more than a court judgement. If anybody does false swearing before him, Sri Varasiddi Vinayaka shall punish him. For this swearing ceremony a sum of Rs. 516/- is collected by temple authorities. This ceremony is done every day. Thus people get instance justice here.

In the ancient Vedas Sri Varasiddi Vinayaka hailed as possessor of gunas of all gods, gandharvas, demons and human beings. In 'Adarvaseershopanishath' Sri Varasiddi Vinayaka is extolled as the parabhramha embodiment of paramathma that have (The absolute). Hence by taking 'Ganapati deeksha' the devotees can fulfill all their wishes with the blessings of Sri Ganesha. The deeksha will be for an of 41 days (Mandalam), 21 days (half mandalam), 11 days(Ekadasa). It is like Swamy Iyyappa (or) Lord Sivadeeksha. And the rules and regulations are almost the same. Sri Ganesh Deeksha can be started in any Ganesh temple but should end at Sri Varasidhi Vinayaka Temple at Kanipakam only.

The significant feature of the Moola Vigraha (Main deity) is that it faces towards north, which is a rarity. The first rays of the sun, fall on the feet of the Lord. Gradually the sun rays disappear after reaching the head of the Lord. The main idol is said to be growing in size, year after year, and the silver Kavacham of various sizes since 1945, are displayed at the main entrance of the temple.

Sri Varasiddhi Vinayaka Swamy Temple is nestled in the Kanipakam Village of Chittoor District. This ancient Ganesha Temple is also known as Kanipakam Vinayaka Temple. The Prime deity of this Temple is Sri Varasiddhi Vinayaka Swamy is a swayambhu, self-manifested idol. A very interesting fact is associated with this temple is that Sri Vinayaka Idol size is increasing day by day. It is believed that the idol will be growing in size until the end of Kaliyuga and then Sri Vinayaka will appear in person. The well from where Sri Varasiddhi Vinayaka manifested is still exist in the temple. The holy water from the well is distributed among the devotees as prasadam in this temple. The Temple is believed to be more than 800 years’ old which was constructed in the early 11th century CE by the Chola king Kulothunga Chola-I. The name of the present Kanipakam village in olden days was called “Viharapuri”.

“KANI” means one and quarter land and, “PAKAM” means flew of water into the land i.e., irrigation. The indication of this was recognized as KANIPARAKAM – ultimately calling as KANIPAKAM which is the Tamil Transcended (Derived) word.

Legends as per the legend of the ancient temple, there were three brothers and each of them had a handicap. One day, they started digging the well for water and suddenly the Iron implement hit a stone like structure. Later, they saw the blood oozing out from the well which made the entire water in the well to turn red. On observing this divine sight, they got rid of their deformities. As soon as the locals came to know about this miracle they tried to deepen the well further.
The "Swayambhu" idol of Sri Varasiddi Vinayaka emerged from the well. Later, people built a temple around the well. Even today, the idol is in the original well and the springs of the well are perpetual. The holy water from the well overflows during rainy season. Another strange feature of the idol is that it is still growing in size. It is believed that swayambhu idol of Sri Varasiddi Vinayaka is the up-holder of truth. The disputes among the people are resolved by taking an oath. It is a regular practice for the people of this region to take a holy dip in the temple tank and swear before the lord to prove their innocence.
Festivals and Celebrations on Vinayaka Chaturthi and English New Year Day are the festivals celebrated in the temple. The annual Brahmotsavam is celebrated from Ganesh Chaturthi which goes on for 21 days with all traditional rituals and gaiety. The colorfully decked festive idol is taken out for procession on all the days on different carriages. The float festival attracts pilgrims from all over the country.

Festivals & Fairs celebrated at the Temple. Brahmostavams for a period of 21 days is the major annual festival. The Brahmostavams will commences from Bhadrapada Suddha Chavithi and be continued for 21 days. During the Brahmotsavam period except temple rituals, Ubhayadara abhishekam other Sevas like Abhishekam, Palabhishekam, Kalyanam, Unjal seva, and Ekathaseva will not be performed. During Brahmosthavams Uthsavamurthulu of Siddi Buddi Sametha Vinayka swamy are decorate specially and taken for procession on various Vahanams in the 4 mada streets of the kanipakam village as detailed below.

Vinayaka Chavathi Festivals & Fairs celebrated at the Temple are:(Bhadrapada Sudha Chavithi)


S.NoFestival DaysBrahmosthavams Uthsavamurthulu
11st dayPushpa Kavallu, Abhishekam, Gramostavam
22nd dayDvajarohanam,abhishekam and Hamsa Vahanam
33rd day Nemali(Peakcock) Vahanam,Gramostavam
44th dayMushika Vahanam,Gramostavam
55th dayAbhishekam,chinna shesha vahanam,pedda  Sesha Vahanam
66th dayGramostavam, Vrishabha Vahanam
77th dayGramostavam, Gaja Vahanam
88th dayGramostavam, Rathotsavam
99th dayGramostavam, Bikshandi Seva Thiru Kalyanam Aswa Vahanam
1010th dayGramostavam, Dwajajarohanam, Vadayathu Utsavam and Ekantha Seva
1111th dayGramostavam, Adhikara Nandi Vahanam
1212th dayGramostavam, Ravana Brahma Vahanam
1313th dayGramostavam,Surya Prabha Vahanam
1414th dayGramostavam, Chandra Prabha Vahanam
1515th dayGramostavam, Yaali vahanam
1616th dayGramostavam, Vimanotsavam
1717th dayGramostavam, Kalpa Vriksha Vahanam
1818th dayGramostavam, Poolangi Seva
1919th dayGramostavam, kamadenu vahanam
2020th dayGramostavam, Pushpa Pallaki Seva
2121st dayGramostavam, Theppotsavam

Further during Brahmotsavam period Annadanam is being arranged continuously from 10 AM to 10 PM to all the visiting Pilgrims with the co- Operation of Philanthropic devotees.



Post a Comment

0 Comments