Ad Code

జామకాయ తింటే కలిగే అద్భుత ఫలితాలు - Health Benefits of Guava Fruit


జామకాయ తింటే కలిగే అద్భుత ఫలితాలు


జామపండ్లలో సి, ఎ, బి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. ప్రతిరోజూ జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి మనల్ని బాధించవు.

జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు వీటిలో అధికంగా ఉంటాయి. ఊబకాయంతో బాధపడేవారు కూడా రోజూ జామపండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

1.మధూమేహం ఉన్న వారికి జామ చాలాబాగా ఉపయోగపడుతుంది.

2.అధిక ఆకలిని జామ తగ్గించడంలో తోడ్పడుతుంది.

3.జామకాయలు అధికంగా తినడం వలన ఉత్సాహంగా ఉండవచ్చు.

4.జామకాయలలో అధిక సంఖ్యలో విటమిన్లు ఉంటాయి.

5.చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు అందరు తినదగిన పండ్లలో జామకాయలు కూడా ఒకటి.

6.జామకాయలలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

వీటిని అధికంగా తినటం వలన కాన్సర్ వంటివి దరిచేరవని నిపుణులు పేర్కొంటున్నారు.అటు జామ ఆకులోను చాలా ఔషద గుణాలు ఉన్నాయి.వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు.లేత జామ ఆకులను పరగడుపునే తింటే నోటి పగుళ్లు సమస్య ఉండదు.



Health Benefits of Guava Fruit

May Help Lower Blood Sugar Levels.
May Boost Heart Health.
May Help Relieve Painful Symptoms of Menstruation.
May Benefit Your Digestive System.
May Aid Weight Loss.
May Have an Anticancer Effect.
May Help Boost Your Immunity.
Eating Guavas May Be Good for Your Skin.

Post a Comment

0 Comments