Ad Code

పూజలలో రకాలు, వాటి యొక్క పరమార్థం ఏమిటి? - పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం - Pooja, Archana, Japam, Sothram, Deeksha, Mantram

పూజలలో రకాలు,  వాటి యొక్క పరమార్థం ఏమిటి?



పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, వందనం, ఉద్వాసన.

పూజ: పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది.


అర్చన: అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


జపం:
అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.


స్తోత్రం:
నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


ధ్యానం:
ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.

దీక్ష: దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేకం: అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.

మంత్రం: తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.


ఆసనం: ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


తర్పణం: పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

గంధం: గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. 

"మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వుతల్లీ" అని దేవతలంతో అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు "మీరు గంధంలో కొలువై ఉందురుగాక" అని వరం ఇచ్చారు.
అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.

అక్షతలు: కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.

పుష్పం: పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.
అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.
మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.

(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.

ధూపం: చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.

దీపం: సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజగదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. "అగ్ని" శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.

నైవేద్యం: మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.

ప్రసాదం: భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం.

ఏ రూపంలోని ప్రసాదాన్నైనా "ప్రసాదం" అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల అందరూ "పులిహోర", "కొబ్బరి" అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు.
"పులిహోర ప్రసాదం", "కొబ్బరి ప్రసాదం" అనవచ్చు.

వందనం: అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి.   ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళ పై భగవంతుడికి వందనం చేయొచ్చు.

ఉద్వాసన: ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని  ఉద్వాసనమని అంటారు. చివర్లో  ప్రార్థన , దోష  క్షమాపణ చెప్పి తీర్థ , ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Worship: Destroying the odors of previous life. The one that makes birth and death not exist.

Archana: The one that gives the best result. The four types of Purushida Purushartha is the refuge of the fruit, which pleases the Goddesses. 

Japam: Chanting is the one that removes the sins committed in many births and realizes the other god. This makes life and God. 

Stotram: Stotram is the one which brings happiness to the mind slowly and makes the achiever go away. 

Meditation: Sensual condolence with the mind. 

strike: the one that ignites divine feelings. The one that washes away sins. Strike is the one that liberates you from the bonds of family. 

Abhishekam: If you do abhishekam, if you get it done, you will get all the good things. The anointing removes pride and gives you paranormal philosophy. 

Mantra: Mantra protects from fears by thinking about philosophy. It gives you the power of the universe. 

Aasanam: Asana is the one that gives self-confidence, eliminates diseases, brings innovation, or new-siddhas. 

Tarpanam: It will give new happiness to the superstition with family.

Gandham: In Gandham, all the gods are there. 

 "Give us a boon so that we can also be in your puja" asked Ammavaru with the gods. Then Ammavaru gave a boon saying "May you be a lamp in the sand". Since then, Gandha has gained a higher position in puja. 

Akshatalu: By removing impurities, it will create harmony with the material. Turmeric, Saffron, Nookum (broken rice) should be prepared together. 

Flower: Increases virtue and eliminates sin. The one that gives a good piece of mind. 

Similarly, if you use flowers with thorns, you will face difficulties. 

If you use good smelling flowers, you will be lucky. 

(Nowadays they are killing flowers and separating the feathers and using them. Don't do that like that. Flowers should be used in puja only after squeezing the thighs of Kaga. 

incense: It removes many defects due to bad odors. The one that gives the ultimate joy. So much good can be done by incense. Ghost and demons will run away 

Lamp: The one that smokes out the length of ignorance. The one that does not have pride. The one that illuminates the superiority. The lamp is a sign of wisdom. If you light a lamp in the worship room, the evil effect in the house will not come near. "Agni" is a symbol of Kumaraswamy who is the son of Shiva. 

Naivedyam: Naivedyam is to report sweet things.

Prasadam: The offering that is reported to God is the offering.   The giver of light and happiness. The one that brings harmony. Prasadam is the one that shows the divine vision. Prasadam is a sign of Bhagavad's blessings. The most sacred of substance. 

 Any form of prasadam should be treated as "prasadam" only. Recently, everyone has become accustomed to say 'Pulihora', 'Coconut'. That's not supposed to be said. "Pulihora prasadam", "coconut prasadam". 

Salute: Namaskaram with Ashtangas salute. You can also salute with folded hands. Prostration means bowing down to the ground with your head, mind, words, feet, hands, ears. Only men should do this prostration. This is not what women should do. Women can worship God on their knees. 

Udvasana: Worshiping the surrounding gods and finishing the pooja is called Udvasana. At the end, prayer, apology for the mistake, take prasadas and say swasthi and do udvasana






Post a Comment

0 Comments