యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం
యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రధానాలయంలో స్వయంభువుల పున: దర్శనం మార్చి 28 2022 నుండి ప్రారంభం.
దేశంలోనే ఏకైక నరనారసింహ క్షేత్రం అహోబలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహ క్షేత్రం.
సృష్టికి పూర్వం శ్రీమహావిష్ణువు నరసింహ రూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చారట.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమాన్యహం
అని మంత్రోపదేశం చేశారట. దీని వల్లే బ్రహ్మకు వేద దర్శనమై, ఆ తరువాత సృష్టి మొదలుపెట్టారట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెలసిన పవిత్ర క్షేత్రం యాదగిరి.
స్థలపురాణం:
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే మాదర్షి అంటారు. చిన్నపట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి 'నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠినంగా తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు' అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరారట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి 'ఏం కావాలో కోరుకో' అని అడిగాడు స్వామి.
నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో' అని కోరారట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి ప్రత్యక్షమైయ్యాడు.
నా రూపాలన్నీ నువ్వు చూడలేవు' అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారు. జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి...తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నారట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది.
దేవాలయ విశిష్ఠత:
ఆ తరువాత దాని గురించి ఎవరికీ తెలియదు. యాదగిరి ప్రాంతమంతా సామాన్యులు చొరబడలేని ఆరణ్యప్రాంతం కావడంతో ఇటీవల వరకు అనగా 19వ శతాబ్దం వరకు స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరిగే అవకాశం లేకపోయింది. శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని వెళ్లిన తర్వాత కూడా చాలా కాలం వరకు దుర్గమమై ఉన్నందున ఈక్షేత్రాన్ని ప్రజలు మరచిపోయే వరకు వచ్చింది. కాగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఒకరోజు రాత్రి ఈ ప్రాంత గ్రామాధికారికి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలోనే నాలుగు రూపాల్లో ఉన్నానని గుర్తులు చెప్పారట. గ్రామాధికారి వెళ్ళి రేఖామాత్రంగా ఉన్న స్వామిరూపాలనూ, గుహనూ, ఆంజనేయుణ్ణీ కనుగొన్నారట. అప్పట్నుంచీ స్వామికి పూజాదికాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించారు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.
గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి. లక్ష్మీనరసింహ స్వాములను చూడొచ్చు.
గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కిందన ఉన్న పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి.
ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనినే "విష్ణుకుండం" అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది.
భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించాడు. స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈక్షేత్ర యాజమాన్యం దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరిలక్ష్మీనర్సింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.
ఈ క్షేత్రంలో "ప్రదక్షిణల మొక్కు" ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్థమడలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు శత్ర చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు.
బ్రహ్మోత్సవాలు:
సత్యనారాయణస్వామి వ్రతాలకు అన్నవరం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరిగుట్ట. రోజులో నాలుగుసార్లు ఈ వ్రతాలు జరుగుతాయి.
శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు 11 రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి. బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మోహిని , రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం పూట అలంకారాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు, పూలతో శోభాయమానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు.
మార్గం:
యాదగిరి గుట్ట హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులున్నాయి. హైదరాబాద్ - వరంగల్ జాతియ రహదారిలో రామగిరిక్రాస్ రోడ్డు నుంచి రావొచ్చు. రైలుమార్గంలో భవనగిరి, రాయగిరి, ఆలేరు రైల్వేషేషన్లలో దిగి స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి సరికొత్తగా "యాదగిరి రోడ్డు" పేరిట 8 లైన్ల రహదారి నిర్మాణపనులు చేపట్టారు.
Yadagiri Gutta Lakshmi Narasimha Swamy
Swayambhuvula Puna Darshanam in Yadagirigutta Yadadri Sri Lakshmi Narasimha Swamy's main house will start from March 28 2022
Ahobalam is the only Naranarasimha temple in the country. Yadagirigutta is the temple that has that much importance after that. Because this is panchanarasimha temple.
Before the creation, Sri Mahavishnu gave Darshan to Brahma in the form of Narasimha.
Vishnu is the hero of fierceness, Mahavishnu is the flame, the face of Nrasimha, the terror of the lion, the pearl of death, I bow to you
has been chanted as. Because of this, Brahma got Veda Darshan and then started creating it seems. Nrasimha Avataram is the avatar with such importance. Yadagiri is the holy place where such a Narasimha appeared.
Legend of the place:
The source of the story related to Yadagiri gutta is the Vibhandaka sage in Valmiki Ramayana. Yadarushi is the son of his son Rishyashringu. He is called a madarshi. He who was a devotee of Narasimha from his childhood had a strong desire to visit that swamy it seems. He roamed through forests, hills and corners to search for Narasimha. Narasimhu was not able to see. Yadarshi, who was wandering like that, one day, reached the present Yadagiri forest area and got tired and slept under a ravi tree. Then Anjaneya Swamy appeared in the dream and said 'I liked your persistence. I will be there for you. It is said that if you do penance strictly, Swami will appear. Yadarshi who woke up started penance there itself. Ugranarasimhudu appeared after a few years. Not able to see that brightness, Yadarshi asked to appear in a peaceful form. Then swamy appeared as Lakshmi sametha and asked 'desire what you want'.
Common people cannot do such a terrible penance for your darshan. That's why they asked you to stay here in a peaceful form. Then a swamy appeared on the rock of the hill. Years later Yadarshi had another desire. I have seen Swami in one form. Thinking that he could not see in different forms, he came to this place again and started penance. Some years back swami appeared.
You can't see all my forms' but Jwala, Yogananda, Gandabherunda appeared in the form of Narasimha saying that I will show three forms for you. Jwala Narasimhudu will be in the form of Sarpara. Yogananda will be in the form of Archa idol. Gandabherunda Narasimhudu would have been a pillar in the hill. The next role model. When he asked to unite him with Swami, he did the same it seems. This Yadagirigutta has become in the name of Yadarshi.
Uniqueness of the temple:
and then no one knows about it. Since Yadagiri is a forested area where common people cannot enter, there was no opportunity for offering daily incense to the Swami till recently i.e. till 19th century. Even after visiting Srikrishna Devarayalu, it has come to the extent that people forgot this place as it was remote for a long time. Kaga some two hundred years ago one night swami appeared in a dream to the village head of the area and told him that he was in four forms in the area. The village head has gone and found the swami form, cave and Anjaneyunni which are just lines. From then onward poojadikas have started for Swamy. Gullapalli Ramabhattu has been appointed to oversee these matters. Their descendants themselves are serving this area by keeping it attached.
Swami Jwala Narasimha who is opposite in the womb temple. Yogananda Swamy in the inner Yogamudra Lakshmi Narasimha swamy can be seen.
If you come out of the womb, there is a temple of Lord Hanuman on the left side of the steps. In the big rock crest below Hanuman's statue, Gandabherunda Narasimhu's own form is visible. Pushkarini, if you step down to the left side of stairs after visiting Anjaneya Swamy. If you go down a few steps to the right side, you can see Ramalingeshwara temple along with the mountaineer.
There is a speciality in the Pushkarini of Swamivari in this temple. This is called as "Vishnukundam". The water that flows continuously from the feet of Yadagiri Narasimha Swamy reaches this Pushkarini.
As the number of devotees has increased day by day, this area has become Telangana Tirupati. At this time Rajamothilal Yadagiri Lakshmi Narasimha Swamy, a resident of Hyderabad, listened to the glory and visited the Swamy. Swami had them built a temple. According to him, he built the gate of the tower and the front porch. After that, devotees have been arranging many facilities during their Yatra. Presently, the management of this area is under the supervision of the Devadaya department. Yadagiri Lakshmi Narasimha temple is popular and is flourishing as a gold for devotees.
In this field, 'pradakshina's pride' is important. Devotees believe that due to this there will be relief from mental, physical and financial problems. Devotees will pray for Mandal (41 days), Half Madalam, 11 days Pradakshina. Pradakshinas are done daily for two times to the womb and 16 times to Anjaneya Swamy. It is believed that in the process of fulfilling this vow, Swami will perform sattra treatments to them in his dreams and relieve them from physical pain.
Brahmotsavams:
Yadagirigutta is the famous place after Annavaram for Satyanarayanaswamy vratam. These vratas are done four times a day.
Annual Brahmotsavas of Sri Yadagirigutta will continue as a feast for the eyes for 11 days starting from Falgunasuddha vidiya till twelfth day every year. Special decorations and services will be conducted on the eve of this Brahmotsavam. In the Brahmotsavams that are going to happen for 11 days, Kalyanam, Rathotsavam are important. As a part of Brahmatsaval, Swami Jaganmohini, Rama, Krishna, Narasimha avatars will appear to devotees. Decorations in the morning, services in the evening. Keshavahana seva, Annavahana seva, Kalpavruksham, Garuda seva, Ashwavahana seva to Swami on the occasion of Brahmatsavams. On the occasion of these services, Swami Ammavaru will be decorated with Pattupitambaras, various golden ornaments and flowers and will be parade in the streets of Pura. Ramayana, Mahabharata, Bhagavatam, Vishnusahasranamas and Sundarakanda recitation with 75 Rutviks to enlighten spiritual consciousness.
ROUTE:
Yadagiri gutta from Hyderabad to 60. Just at the distance of you. RTC buses are available to reach here. You can come from Ramagirikross road on Hyderabad - Warangal national highway. You can get down in Bhavanagiri, Rayagiri, Aleru railways and reach Swami's abode. Keeping this field in mind, new 8 lane road construction has been started from Hyderabad named 'Yadagiri Road'.
0 Comments