Ad Code

పోలి స్వర్గం నోము - Poli Paradise Nomu

పోలి స్వర్గం నోము



స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో 'పోలి స్వర్గం నోము'ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.

ఇక కథలోకి వెళితే, ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది. చిన్నది అయిన కోడలే 'పోలమ్మ'. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.

సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.

ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి, పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.

ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది.



సర్వేజనాః సుఖినోభవంతు!
శుభమస్తు!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.



Poli Paradise Nomu

'Poli Paradise Nomu' is one of the pains that women celebrate with most devotion. This pain, which has been protecting its presence since ancient times, is affecting the women of this generation. The story that is the reason for celebrating this pain, sounds like a folk story, interesting to hear like to practice.

If we go into the story Rajaka woman from a remote village would have five daughter-in-law. The last one among those five daughter-in-law The daughter-in-law who is younger is 'Polamma'. Even from childhood, Polamma has more devotion to God. Cutting flowers and doing prayers is the time for her. There was no obstacle to her relationship with God until she was married. But after getting married, she was happy. To cut flowers to do prayers she could not even go to the temple. That's why her aunty.

Usually, if the daughter-in-law of the house has more devotion, anyone will appreciate it. But in the case of similar it has changed. Like aunty is proud of being a great devotee. She has increased her pride as some moms and sisters chanting her back. Thinking that her name will be lost due to the comparison, she would have kept her in the house and brought the other daughter-in-law to the temple.

In the background, one Karthika has done household works on new moon day and made the puja items unavailable for her and the mother-in-law went to the river bath with the other daughter-in-law. Without any pain, she took a bath near the well and took the cotton from the cotton tree and made it a pressure. She took away the butterfly from the cold and lit the lamp with it and worshiped the God. Poli's favorite god has sent her a flower plane.

As soon as the people of the village were watching, the plane climbed. The mother-in-law who came up a little while the plane, caught her legs to pull the comparison down saying that her daughter-in-law couldn't go to heaven. Immediately the rest of the daughter-in-law hanged each other's legs and hung down the plane. The Goddesses who saw it fell off the plane saying they didn't have a comparison. Poli has gone to heaven with a bondi.

From that time every year, Ashwayuja Amavasya started Till Karthika Amavasya, every day on the auspicious occasion of Brahmi, it is unavoidable to wake up and bathe in the river, lighting the lamp, telling the same story and putting the Akshinthalu on the head is coming.





Post a Comment

0 Comments