Ad Code

తరతరాల వారధి ఈ మెట్లబావి - Steps Well

తరతరాల వారధి ఈ మెట్లబావి (Step Well)


క్రీ. శ.17 వ శతాబ్దం నాటి అపురూప కట్టడం  మైలచర్ల గ్రామంలో ఉన్న పురాతన మెట్ల బావి. ఇప్పటికి ఈ బావిలో పుష్కలంగా నీరు ఉండి ప్రజల దాహార్తిని తీరుస్తుంది.

దాదాపు 300 సంవత్సరాలు క్రితం మనుషులకు, పశువులకు తీవ్ర మంచినీటి కొరత వచ్చింది.
అక్కడ గల నల్లమల అటవీప్రాంతం బైరవ కొనలో గల సాధువు సలహా మేరకు "గండి సోదరులు" అనే పశువుల పెంపకం దార్లు మైలచర్ల గ్రామం లో ఈ మెట్ల బావిని నిర్మించారని గ్రామ పెద్దల కథనం.

మైలచర్ల గ్రామం చంద్రశేఖరపురం  మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నది, ఇప్పటికీ ఈ మండలం మంచినీటిలో ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటుంది. చుట్టుపక్కల ప్రజలు మైళ్ళు నడచి మైలచర్ల గ్రామంలో ఉన్న పురాతన మెట్ల బావి నీటిని ఉపయోగించుకొంటారు.

తరాలు మారినా, శతాబ్దలు గడిచినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చెక్కుచెదరని నిర్మాణం ఆనాటి నిర్మాణ కౌసల్యానికి, కళాత్మక దృష్టికి నిదర్శనంగా దీపపు ప్రమిద ఆకారంలో నేటికి రాచ ఠీవితో నిలచిన మైలచర్ల మెట్లబావి ప్రస్తుతం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్నది.





Post a Comment

0 Comments