Ad Code

తిరుచెందూర్‬ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి - Sri Subramanya Swamy Temple (Tiruchendur)

తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి


తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి ''మహాంబోధితీరే మహాపాపచోరే'' ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో ‪పద్మాసురుడు‬ (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

"తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి.

సముద్ర తీరంలో అంత ‎శక్తివంతమై‬, అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు.
ఈ క్షేత్రం తమిళనాడు లో ‎తిరునెల్వేలి‬ నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. ‎సుబ్రహ్మణ్య‬ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ‪ఆదిశంకరాచార్యుల‬ వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు ‪సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం చేశారు.

ఈ ‪భుజంగ‬ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో ‪వంశంలో‬ తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి.

అటువంటి ‪దోషములను‬ కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య ‪భుజంగము‬ ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన ‪స్తోత్రం‬ఇది. దీనిని ప్రతీ ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి. ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది, మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి.

ఈ సంసారము అనే మహా ‪సముద్రము‬నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని "‪మహాంబోధితీరే‬మహాపాపచోరే" అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి.

తిరుచెందూర్ విభూతి మహిమ:
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన ‪‎విభూతి‬ తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ ‪విభూతిని‬ సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు ‪నయం‬ అవుతాయి.



సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.



An asura by name Surapadma was ruling Veera Mahendrapuri, an island fortress. He performed many austerities invoking Lord Shiva and the Lord granted him many boons. Later, the asura became arrogant and captured all the three worlds—the heaven, earth and the hell. He made the Devas, the heavenly immortals to do menial task. The Devas were unable to bear his torture and complained to Lord Shiva. Lord Shiva opened his third eye to create a son to kill Surapadma. Six sparks of fire emanated from the third eye. These divine sparks were received by River Ganges through Agni, the God of Fire and passed on to the Himalayan lake, Saravana Poigai. Here they were transformed into six babies. Saravanapoigai .Here they were transformed into six babies.

These babies were suckled by the six Kirithika nymphs. Lord Shiva and Goddess Parvathi Devi came to Saravana Poigai, and when Goddess Uma fondly clasped the babies they joined together to become Lord Arumuga with six faces and twelve arms. When child Arumuga grew up to become a young boy, Lord Shiva asked him to destroy Surapadma and free the Devas from their cruel bondage. Lord Muruga reached Tiruchendur with his huge army and camped. He sent his lieutenant, Veerabahu to the asuras as an emissary and asked Surapadma to release the Devas. Since Surapadma turned down the request, a war ensued.

An intense battle was fought for a few days. During the first five days of the war, the brothers of Surapadma and all other asuras perished. On the sixth day, in the battle between Lord Muruga and Surapadma, the lance of Lord Muruga pierced the body of Surapadma, who got himself transformed into a frightful mango tree, and broke it into two. The broken pieces instantly transformed themselves into a mighty peacock and a cock. Lord Muruga took the peacock as his vahana or vehicle and the cock on his banner. This event is popularly known as Surasamharam, or the destruction of Surapadman. After Surasamharam, Lord Muruga desired to worship his father, Lord Shiva. Hence Mayan, the divine architect constructed this shrine at Tiruchendur. Even now Lord Subramaniyan is seen in the posture of worshiping Lord Shiva in the sanctum sanctorum.






Post a Comment

0 Comments