Ad Code

సహస్రాక్షీ (చతురక్షరి) - Chaturakshari

సహస్రాక్షీ (చతురక్షరి)



ఇది నాల్గు అక్షరముల మంత్రము. పూజాకాలంలో “సహస్రాక్ష్యై నమః” అని శ్రద్ధా.భక్తులతో ఉచ్చరించాలి.

సహస్ర - అక్షీ = అనంతములైన కన్నులు గలది.

న్నులు అనగానే బాహ్యమైన గోళాలు మాత్రమే గాదు. ఆ గోళాల ద్వారా చూచే శక్తియును అగును. శవానికినీ నేత్రాలు ఉంటాయి. అవి చూడలేవు. మనస్సే సర్వేంద్రియాల ద్వారా ఆయా పనులను చేస్తూ ఉంటుంది.

మన కన్నులే గాక ప్రపంచంలోని అన్ని ప్రాణుల కన్నులును ఆ తల్లి కన్నులే అగును. అందుచే అందరి కన్నుల ద్వారా చేసేది ఆ తల్లియే అని సారాంశము. ఇంద్రుడికి సహస్రాక్షుడు అని పేరు గలదు. అతడు సర్వ దేవతాధిపతియు విశేషించి సర్వాధిపతియు, దిక్పాలకాధిపతియును అగును. అమ్మ సర్వ ప్రపంచాధినేత్రి, విశ్వాధినేత్రి.

మన కన్నులను మనం పవిత్రం చేసికొన్నచో, విశ్వంలోని అందరి కన్నులును మనలను పవిత్రంగా చూస్తాయి. బిందెలోని ఒక నీటి బిందువు తియ్యగా ఉన్నచో బిందెలోని నీరంతయును తియ్యగానే ఉంటుంది. “భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః” అని శ్రుతి.
ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారిపై అందరి చూపులు శుభంగా ఉంటాయి. దేవీ కరుణచే తరిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments