Ad Code

పద్మాసనా (చతురక్షరి) - Chaturakshari

పద్మాసనా (చతురక్షరి)



ఇది నాల్గు అక్షరముల మంత్రం. పూజాసమయంలో “పద్మాసనాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

పద్మ - ఆసనా = పద్మము (పద్మములు) ఆసనముగా గలది శ్రీదేవి.
పద్మము వికసించే స్వభావం గలది. వికసించడం, అభివృద్ధి పథాన పురోగమించడం అవుతుంది. ఉపాసించే భక్తులకు అభివృద్ధి మార్గాన్ని నిర్దేశించేది శ్రీదేవి అని సామాన్య భావము.
వ్యష్టి పక్షముగా మూలాధారము ద్వాదశ దళముల పద్మముగాను, మణిపూరకమును దశదళముల పద్మముగాను, సహస్రారమును సహస్రదళ పద్మముగాను కుండలినీ యోగోపాసకులు అభివర్ణిస్తారు. పరాశక్తికి సంబంధించిన అనేక వస్తువులను, అవయవాలను సైతం పద్మంతో పోల్చడంగలదు.

“ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమపద్మాం వరాజైమ్
సర్వాలబ్కార యుక్తాం సతత మభయదాం భక్తనమ్రాం భవానీం
విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్ర్పదాత్రీమ్”

ఇందు "పద్మాసనస్థాం - పద్మ పత్రాయతాక్షీమ్” - కరకలిత లసత్ - హేమ పద్మాం” అనే విశేషణ పదాలు సాధకులకు పురోగతి దర్శకత్వంలో పరాశక్తికి ఉండే ఆసక్తిని స్ఫురింపజేస్తున్నాయి. ఆది కవి వాల్మీకి మొదలుకొని కవులు అందరును తమ రచనలో పద్మానికి, పద్మ వంటి పదాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పర్యాయపదాలైన కమల, నీరజ.

ఉదాహరణ: రామ: కమల పత్రాక్షః"; ఆది కవి వాల్మీకి “పద్మహస్తా - పద్మాసనా - పద్మనేత్రా” (లక్ష్మీస్తుతి). వికాసానికి పద్మము సంకేతము అని సారాంశము.

ఆ మంత్రంతో దేవిని ఉపాసించే సాధకులు పురోగాములై జన్మ సఫలతను పొందగలరు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments