పంచకృత్యపరాయణా (అష్టాక్షరి)
ఇది ఎనిమిది అక్షరములు గల్గిన మంత్రము. పూజాకాలంలో "పంచకృత్య పరాయణాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
పంచకృత్య - పరాయణా = సృష్టి - స్థితి - లయ - సంహార - తిరోధాన అనుగ్రహములు అనే అయిదు కార్యములందును ఆసక్తి కలది శ్రీదేవి.
"సృష్టికర్త్రీ" అనే 264వ మంత్రం నుండి 273వ మంత్రమైన “అనుగ్రహదా” అనే మంత్రం వరకు పంచకృత్యములు వివరింప బడినాయి. ఈ 11 మంత్రముల సారాంశమే ఈ మంత్రము అగును.
239వ మంత్రం అయిన “చంద్రవిద్యా” అనే మంత్రం నుండి ఈ 274 వ మంత్రం వరకు తెలుపబడు విషయాలు అన్నియును చంద్రవిద్యకు సంబంధించినవి.
శ్రీవిద్యోపాసకులలో 12 మంది ప్రసిద్ధులు:
1. మనువు
2. చంద్రుడు
3. కుబేరుడు
4. అగస్త్యుడు
5. లోపాముద్రా
6. మన్మథుడు
7. అగ్ని
8. ఇంద్రుడు
9. సూర్యుడు
10. దుర్వాసుడు
11. స్కంధుడు
12. శివుడు.
(1) జాగ్రత్ (2) స్వప్న (3) సుషుప్తి (4) తురీయ (5) తురీయాతీతములు అనే ఈ అయిదింటిని పంచకృత్యములు అనియు కొందరు వ్యాఖ్యానిస్తారు.
(1) ఆత్మ (2) పరమాత్మా (3) సూత్రాత్మా (4) జీవాత్మ (5) ప్రత్యగాత్మా - ఇట్టి పంచవిధ ఆత్మస్వరూపిణి శ్రీదేవి.
"ఆత్మాచ పరమాత్మాచ సూత్రాత్మాచ తథా పరః
జీవాత్మ ప్రత్యగాత్మేతి హ్యాత్మభేదా భవన్హి"
(ప్రణవనాద దీపిక - యోగానందయతి)
ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి సృష్టితత్త్వం పూర్తిగా అవగతం అవుతుంది. రాగద్వేషాలు అంతరిస్తాయి. క్రమంగా పరమపదం ప్రాప్తిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments