Ad Code

ఈశ్వరీ (త్ర్యక్షరి)

ఈశ్వరీ (త్ర్యక్షరి)



ఇది మూడు అక్షరాలు గల్గిన మంత్రము. ఈ మంత్రాన్ని పూజాసమయంలో "ఈశ్వర్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

ఈశ్వరీ - శుద్ధ సత్వగుణ ప్రధానమైన మాయలో ప్రతిఫలించిన పరబ్రహ్మ తత్త్వమును ఈశ్వరుడు అందురు. ఇతడు మాయను స్వాధీనం చేసికొని ఉంటాడు. అట్టి ఈశ్వరుని శక్తి రూపమైనది పరాశక్తి. శక్తి - శక్తములకు అబేధ భావముచే శ్రీదేవియు ఈశ్వర రూపిణియైనది.

"మాయాబింబో వశీకృత్య తాంస్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః"

అక్షర పరబ్రహ్మము నిర్గుణము. మాయా బింబమై బ్రహ్మ తత్త్వము - సగుణము. అందుచే సర్వజ్ఞుడు - సర్వశక్తి సంపన్నుడు అనంత కళ్యాణగుణ పరిపూర్ణుడును భక్తిపరుడును అగును. అట్టి సగుణ బ్రహ్మ శక్తియే శ్రీదేవి అగును.

ఈ మంత్రంతో ఉపాసించే భక్తులు అనంత శుభములతో విరాజిల్లుదురు. దేవీ కరుణచే పరమ పదమును పొందగలరు.

పంచబ్రహ్మలలో ఈశ్వరుడు నాల్గవ వాడు - తద్రూపిణియైనది శ్రీదేవి అనియు కొందరు వ్యాఖ్యానిస్తారు.






Post a Comment

0 Comments