Ad Code

తిరోధానకరీ (షష్టాక్షరి) - Shatakshari

తిరోధానకరీ (షష్టాక్షరి)



ఇది ఆరు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో "తిరోధానకర్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

తిరోధాన - కరీ = సమస్త సృష్టిని కనబడకుండా పోవునటుల చేయునది శ్రీదేవి.

ఆ తల్లి కన్నులను తెరచినచో ఆకాశాది రూపంగా క్రమ పద్ధతిలో సమస్త సృష్టియును ఉత్పన్నం అవుతుంది. కన్నులు మూసికొన్నచో ప్రతిలోమ పద్ధతిలో అనగా ఎటుల జనించిందో అదే క్రమంగా అంతర్హితం అవుతుంది.

“ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః” (శ్రీ లలితా సహస్రనామావళి). ఇదే విషయం శ్రీ భగవద్గీతలోను ఇటుల గలదు.

“సర్వభూతాని కౌన్డేయ ప్రకృతిం యాని మామికామ్
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్" (భగవద్గీత)

శ్లోక భావము:
సర్వభూతములు కల్పాంతము నందు అరూపమును పొందును. అనగా నాలో లీనం అగును. మరల వాటిని కల్పారంభమున యథాక్రమంగా వాటి ప్రారబ్దానుగుణంగా సృష్టిస్తాను.

ఈ మంత్రంచే ఉపాసించే వారికిని ఈశ్వర తత్త్వం - సృష్టి రహస్యం అవగతం అవుతుంది. సర్వము ఈశ్వరేచ్ఛగా భావించి రాగద్వేష రహితుడై తరిస్తాడు.





Post a Comment

0 Comments