Ad Code

రాహుకేతువులు సంపూర్ణ యోగం, సర్ప యోగము సంతాన అంశము - Rahu and Ketu

రాహుకేతువులు సంపూర్ణ యోగం,
సర్ప యోగము సంతాన అంశము


పంచమ స్థానమందు రాహువు ఉండి,కుజునిచే  చూడబడిన ను, లేదా పంచమ స్థానమున కుజుని  స్థానమై, అనగా మేష వృశ్చిక ములు, పంచమ స్థానం ఐ, అందు రాహు గ్రహం ఉన్నను.పంచమాధిపతి రాహువుతో కలిసి ఉండగా, పంచమ స్థానం ముందు శని చంద్రులు కలిసి ఉన్నాను.

సంతాన కారకుడు, కుజునితో ను. రాహు లగ్నము నందు, పంచమాధిపతి స్థానము నందు ఉన్నప్పుడు, పంచమ స్థానమున ఉచ్ఛ స్థానమున  రాహువు తో కూడి, బుద్ధుని చే చూడబడిన, పై యోగము లన్నియు సర్ప సర్ప యోగములు అవుతాయి, వీటిని జాగ్రత్తగా విశ్లేషించాలి.

ఫలితములు:
ఈ యోగము నందు జన్మించిన వారు సర్ప శాపకారణంగా సంతానము లేని వారు అవుతారు.
పైన తెలియజేయబడిన యోగములను అనుసరించి, పంచమ స్థానమున కు సంబంధించి ఆశీస్సులు లేదా శాపములు. సంతానం కలగకపోవడానికి కానీ, లేదా గర్భస్రావము లు జరుగుటకు గాన, కారణం అవుతాయి, పై యోగముల యందు పంచమము, పంచమాధిపతి కారకుడు మరియు రాహువు ప్రధాన కారకులు అవుతారు.

ఉదాహరణకు మొదటి యోగములో, పంచమ స్థానంలో రాహువు ఉండి కుజునిచే  చూడడం జరిగినది. లేదా పంచమ స్థానం, మేష వృశ్చికముల లో ఒకటి అయి అందు రాహువు యొక్క స్థితి ఏర్పడాలి, ఈ యోగము కర్కాటక,  ధనుర్ లగ్నం  వారికి, వర్తించును.
 

ఇక రెండవ యోగము, ఎక్కువ మందిలో కనిపించే యోగము, పంచమాధిపతి రాహువుతో నూ, పంచమం లో శని చంద్రుల కలయిక, లేదా పరస్పర వీక్షణ జరగాలి, ఈ యోగము లో శని చంద్రుల కలయిక విచారణకు, లేదా నష్టము లకు,  కారణం అవుతుంది. పంచమ స్థానం సంతాన భావం అయినందున, శని చంద్రుల కలయిక విచారమునకు కారణం అయినందున, సంతాన లేమి లేదా సంతాన నష్టం వల్ల, ఈ స్థితి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.
 

ఇక మూడవ యోగము విచారణ, సంతాన కారకుడుగా గురు కుజునితో కలవగా, రాహు లగ్నమందు ఉండుట, పంచమ స్థానాధిపతి, 6, లేదా 8, లేదా 12వ స్థానంలో ఉండాలి, ఈ యోగము గురుబలం పై ఆధారపడి ఉంటుంది, గురువు ష డ్ బాలాయుతుడై  ఉన్నప్పుడు. ఈ యోగ ప్రభావం ఏర్పడదని కూడా చెప్పవచ్చును.

ఉదాహరణకు ఒక జాతకం, గురుడు షడ్ బలయుతుడై, 8 యూనిట్ల బలము కలిగి ఉండటంలో, ఈ యోగము బలహీనపడి ఇద్దరు సంతానం కలగడం జరిగినది, అయితే ఇక్కడ, పంచమాధిపతి దుస్థానస్థితి చేత, వీరి భార్యకు రెండు మూడు సార్లు గర్భస్రావం జరగడం జరిగింది, దీని నివారణకు గాను, నవగ్రహ శాంతులు తర్పణాలు హోమాదులు, సర్ప సూక్త అనుసంధానం, ఏకాదశ రుద్రాభిషేకములు, చేయించటం ద్వారా సంతాన ప్రాప్తి కలిగింది.

ఇక చివరి యుగము ఇక్కడ కూడా పై యోగము వలె ఉన్నప్పటికినీ, చంద్రుని స్థానములో బుద్ధులు స్థితివల్ల ఈ యోగము ఏర్పడినది.

సర్ప యోగము పరిశీలించేటప్పుడు, సంతాన కారకుడు గురుడు, మరియు పంచమ స్థానాధిపతి స్థితి, శుభగ్రహ లేదా పాప గ్రహముల దృష్టి, పూర్తిగా పరిశీలించి నిర్ణయం చేయవలయును.

సర్వేజనా సుఖినోభవంతు,  సమస్త సన్మంగళాని భవంతు.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only.





Post a Comment

0 Comments