Ad Code

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం - Omkareshwar Jyotirlinga Temple

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం


మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో కల గౌరీ సోమనాథ్ మందిర్ లో మహాశివునికి అద్భుతమైన సోమవారం ఉదయం పూజ వీడియో ఇది.
ఈ మందిరం లో 6 అడుగుల ఎత్తున్న శివలింగం వుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు పెద్దలు రెండువైపులా నుంచి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా వారి చేతులు కలవలేవు. కానీ అదే మేనమామ మేనల్లుడు అయితే వారి చేతులు కలుస్తాయి. అదే విచిత్రం.
పూర్తి మృదువైన నల్ల రాతితో తయారు చేయబడిన ఈ శివలింగం చాలా పాతది అయినప్పటికీ, ఇప్పటికి కొత్తదానిలా నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే బయట కూర్చుని వున్న భంగిమలో వున్న నంది కూడా ఇదే మృదువైన రాతితో, అదేవిధంగా నిగనిగలాడుతూ ఉంటుంది. పురాణ కధనాల ప్రకారం ఈ ఆలయంలో ఎవరైనా నంది కొమ్ముల నుంచి శివుడిని చూస్తే వారి మరుజన్మకి సంబంధించిన విషయాలు గోచరిస్తాయని అని నమ్మకం.





Post a Comment

0 Comments