Ad Code

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని శ్లోకాలు

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని శ్లోకాలు

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||

తాత్పర్యం:
మాంసం తినడం,
మద్యం తాగడం,
స్త్రీతో సాంగత్యం,
క్షవరం చేసుకోవటం,
తలకు నూనె పెట్టుకోవడం,

ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు. కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం.
ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన
పెద్దలు దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా, ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.
 ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం.

 అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి.
ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రంపాలు చేశారు, చేస్తున్నాము. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వన్నీ తెలిపేది మన హైందవ సంస్కృతి.

అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.

పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుఖానాల వారు అమావాస్య నాడు తెరువరు.

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మధ్యాన్ని తాగే వారు కాదు.

కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది. ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటలదాకా పడుకునే వారున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. విదేశీ సంస్కృతిని విడనాడండి. స్వదేశీసాంప్రదాయాలను పాటించండి. యోగ చేయండి. ప్రాణాయామం చేయండి. సూర్యనమస్కారాలు చేయండి. సూర్యోపాసన చేయండి. ఆయురారోగ్యఐశ్వర్యాలను పొందండి.

కరోనా బారిన పడినవారు ఎక్కువగా మాంసాహారులేనట, జగద్గురు వీరబ్రహ్మేంద్రులు  జీవహింస పాపమంటే నమ్మం. కానీ ఇప్పుడు కొరోనా మాంసం తినేవారికి తొందరగ సోకుతుందంట. WHO నిర్ధారించింది.
మనఆరోగ్యం మనచేతిలో మనప్రాణాలు మనచేతిలో మాస్కులు ధరించండి. భౌతికదూరం పాటించండి.
ఆరోగ్యనియమాలు పాటించండి.కషాయం తాగి కరోనా ను కలసికట్టుగా ఎదుర్కొందాము.





Post a Comment

0 Comments