Ad Code

సామెతల్లో ఆయుర్వేదం

సామెతల్లో ఆయుర్వేదం



"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" అని కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది! పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ! ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు! త్రిదోషహరం తిప్పతీగ అని సామెత! "ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల" ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని సామెత ఏమంటే "కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు" పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా "పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు" "ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు" వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది సామెత ఇలా "ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది" కరక్కాయ పువ్వు, పిందె, పండు చాలా ఉపయోగకరమైనవి శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ,హృద్రోగం ,గ్రహణి, కామిల, పాండు. ఇన్ని రోగాలు హరిస్తుంది. అందుకే "మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి" అని సామెత. ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది. సామెత ఇదుగో "పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది" "ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి " అలానే శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని, ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి! పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది? సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది? అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది. జాతి జీవనాడి నశిస్తుంది.





Post a Comment

0 Comments