Ad Code

జాగరిణీ (చతురక్షరి) - Chaturakshari

జాగరిణీ (చతురక్షరి)


ఇది నాల్గు అక్షరాలు గల్గిన మంత్రము. పూజా సమయంలో “జాగరిణ్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

జాగరిణీ = జాగ్రదవస్థలో ఉండునది శ్రీదేవి.

విశ్వంలో ఉండే జీవుల జాగ్రదవస్థను ఈ మంత్రము సూచిస్తుంది. ఈ జాగ్రదవస్థలో జీవుడు స్థూల శరీరాభిమానియై ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాలను అనుభవిస్తాడు. వ్యష్టి పక్షమున విశ్వుడు, వైశ్వానరుడు అందురు. సమష్టి స్థూల శరీరాభిమానిని విరాట్ అని అందురు.
వ్యష్టి - సమష్టి - జాగ్రదవస్థా రూపిణియై సర్వ విషయభోక్తి అయినది పరాశక్తియేగాని తదితరముగాదు.

ఈ మంత్రోపాసనచే అంతయును అమ్మరూపంగా భాసిస్తుంది. శాశ్వతానందము ప్రాప్తిస్తుంది.




Post a Comment

0 Comments