Ad Code

స్వపనీ (త్ర్యక్షరి)

స్వపనీ (త్ర్యక్షరి)



ఇది మూడు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో “స్వపన్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

స్వపనీ = స్వాప్నావస్థను అనుభవించేదియు శ్రీదేవియే.

స్వప్నావస్థలో జ్ఞానేంద్రియాలు - కర్మేంద్రియాలు మనస్సులో విలీనత పొందుతాయి.
మనస్సుతో అన్ని ఇంద్రియ వ్యాపారాలు చేయబడతాయి. స్వప్నావస్థలోని శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. స్వప్నావస్థలోని జీవుని తైజసుడు అందురు. ఇది వ్యష్టి పక్షము.

సర్వజీవ స్వప్నావస్థాభిమానియైన వానిని అనగా సమష్టి స్వప్నాభిమానిని హిరణ్యగర్భుడు అందురు.

స్వప్నావస్థ నుండి జాగ్రదవస్థను పొందిన తర్వాత స్వప్నావస్థ విషయాలను స్మరించడం జరుగుతున్నది. ఇందుచే జాగ్రదవస్థలో విషయ భోక్తయు - స్వప్నా వస్త విషయ భోక్తయు ఒక్కరే అని గ్రహింపదగును.

జాగ్రదవస్థ స్థితివలె స్వప్నావస్తా స్థితియును దేవీ రూపములే అగును. అంతయు దేవీ రూపమే అగును.

సర్వము దేవీ రూపముగా భావించే సాధకునికి రాగద్వేషాలు అంతరిస్తాయి. పరమశాంతియు, పరమపదమును ప్రాప్తిస్తాయి.





Post a Comment

0 Comments