Ad Code

ప్రాజ్ణాత్మిక (చతురక్షరి) - Chaturakshari

ప్రాజ్ణాత్మిక (చతురక్షరి)



ఇది నాలుగు అక్షరాలు గల మంత్రము. పూజాసమయంలో "ప్రాజ్ణాత్మికయై నమః" అని శ్రద్దాభక్తులతో ఉచ్చరించాలి.
ప్రాజ్ణా - ఆత్మిక = ప్రజ్నానఘన రూపిణియైనది.
సుప్తవస్థలోని జీవుడిని "ప్రాజ్నుడు" అంటారు. ఇది వ్యష్టి పక్షము. సమష్ఠిలో సుషుప్త్యాభిమానిని "ఈశ్వరుడు" అని అవ్యకృతుడు అని అంటారు.

ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో న్తర్యామ్యేష
యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్
(మాండుక్యోపనిషత్)

ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే కారణం.
ఈ మంత్రముతో ఉపాసించేవారు సుషుప్తిలోని జ్ణాన కారణస్థితి తెలుసుకొని తరిస్తారు.





Post a Comment

0 Comments