Ad Code

గోఫ్త్రీ (ద్వ్యక్షరి)

గోఫ్త్రీ (ద్వ్యక్షరి)


ఇది రెండు అక్షరాల మంత్రము. పూజాసమయంలో “గోఫ్రైనమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

అర్ధముః - గోఫ్త్రీ - ఇంచునది, పాలించునది శ్రీదేవి.

సకల చరాచరమైన ప్రపంచమును సత్త్వ ప్రధానమైన విష్ణు రూపముగా రక్షించేదియు శ్రీదేవియే అని భావము. బ్రహ్మ ద్వారా సృష్టించేదియు, విష్ణువు ద్వారా రక్షించేదియును ఆ తల్లియే అని సారాంశము.

గుపూ - గోపనా - రక్షణయోః అనే ధాతువు నుండి గోత్రే శబ్దము ఉత్పన్నమైనది. అందుచే గోపనము అనగా గుప్తము, రహస్యము అనియు ఇంకొక అర్ధము లభిస్తుంది. అందుచే సర్వ మానవులందును కుండలినీ శక్తియే మూలాధారాది చక్రరూపంగా ఉండునదియై ఉపాసించే సాధకులను రక్షించేది శ్రీదేవి అనియు తలంపదగును.

"షడ్భిః బ్రహ్మ ఉచ్యతే " మొదలైన వాక్కులచే కుండలినీ శక్తి ఆరు చక్రాలను దాటినచో రుద్రగ్రంధి విభేదనము అగును అని సాధకులకు అనుభవ సిద్ధము. ఇట్లు గుప్తమైన కుండలినీ విద్యయై రక్షించేది శ్రీదేవి అని ఫలితార్థము.

ఈ మంత్రంచే ఉపాసించే సాధకులు యోగస్థితులై అమ్మ కరుణచే తరిస్తారు.




Post a Comment

0 Comments