Ad Code

చద్దన్నం ప్రయోజనాలు - Amazing Health Benefits of Eating Breakfast

చద్దన్నం ప్రయోజనాలు



చద్దన్నం అంటే ఎక్కువ మందికి చిన్నచూపు. చద్దన్నం అంటే ఆ ఏం తింటాములే అన్నట్లుంటుంది. రాత్రి పూట మిగిలిపోతే పొద్దున్నే తినేదే చద్దన్నం అన్న సాధారణ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నం తినాలని చెపుతోంది. ఎందుకో చూడండి.
చద్దన్నం ప్రయోజనాలు: అన్నం పులిస్తే ఐరన్, పొటాషియ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది.
ఉదా. రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములు పెరుగుతుందట.. బీ6, బీ12 విటమిన్లు కూడా బాగా లభిస్తాయి.
శరీరాన్ని తేలికగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
శరీరానికి అవసరయ్యే బాక్టీరియా బాగా పెరుగుతుంది.
అధిక వేడితో కడుపులో ఉండే దుష్పలితాలు తగ్గుతాయి.
పీచు అధికంగా ఉండి మల బద్దకం, నీరసం తగ్గుతాయి.
బిపి అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.
దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు. ఎక్కువ సమయం తాజాగా ఉంచుతుంది.
అలర్జీ కారకాలను, మలినాలను తొలగిస్తుంది.
పేగుల్లో అల్సర్లను తగ్గిస్తుంది.

రాత్రి వండిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
రాత్రి వండిన అన్నాన్ని ఒక చిన్న గినె్నలో తీసుకుని అది మునిగేవరకూ పాలుపోసి నాలుగు మజ్జిగ చుక్కల వేస్తేతెల్లవారేసరికి ఆ అన్నం మొత్తం తోడుకుని పెరుగులాగా అవుతుంది.
ఈ తోడన్నం లేదా పెరుగన్నానికి తాలింపు పెట్టుకోవటం. ఉల్లిముక్కలకు, టమాటో, క్యారెట్ లాంటివి కలుపుకోవటం చేయవచ్చు.
ధనియాలూ, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని ఒకటి లేక రెండు చెంచాల పొడిని తీసుకొని తోడన్నం లేదా చల్లన్నం నంజుకొని తింటే దోషాలు లేకుండా ఉంటాయి.
ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహారం. బక్కచిక్కిపోతున్న వారు తోడన్నాన్ని, స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడం మంచిది.
ఉదయాన్నే తినాలి. ఆలస్యం అయితే మరింత పులిసి కొత్త సమస్యలు వస్తాయి.





Post a Comment

0 Comments