Ad Code

నిత్య పూజ - Nitya Pooja

నిత్య పూజ



దేవుడి దగ్గర శుభ్రం చేసి చక్కగా అలంకారం చేసి దీపానికి కుంకుమ పెట్టి దీపారాధన చేసి, ఒక ఉద్దరిణిలో మంచి నీళ్ళు ఉంచి , ఏది పెట్టగలరో అది నైవేద్యం పెట్టి ఏది లేకున్నా కొంచెం బెల్లం ముక్క పెట్టాలి, విష్ణువు రూపాలకు తులసి ఆకు తులసి తీర్థం పెట్టాలి.

స్వామి నేను క్షేమంగా మేలుకున్న ఈ రోజు చాలా మంచి రోజు ఇది శుభతిది, శుభ యోగం, శుభదినం, నేను చేస్తున్న ఈ పూజలో లోటు ఎంచకుండా అనుగ్రహించి నావల్ల ఎవరు బాధ పడకుండా నేను ఎవరి వల్ల బాధ పడకుండా ఈ రోజు నేను చేసే పనిలో నష్టం రాకుండా ఎటువంటి గండాలు లేకుండా తోడుఉండి రక్షించు ,అని వినాయకుడి అక్కడ ఉన్న మీ ఇంటి అర్చనా మూర్తులకు నమస్కారం చేసి ఆగరబట్టి ధూపం కానీ సాంబ్రాణి కానీ వేసి నైవేద్యం సమర్పించాలి, ఏదైనా కోరికతో అంటే ఇంటి కోసం అయితే వాళ్ళు, తల్లి సొంత ఇల్లు కొనాలి లేదా కట్టుకోవాలి అన్న సంకల్పమ్ తో మణిద్వీప వర్ణన పారాయనఁ చేస్తున్నాను మాకు ఉన్న ఆటంకాలు తొలగించి సొంత గృహం త్వరగా లభించాలి అని సంకల్పమ్ చెప్పుకొని మణిద్వీప వర్ణన చదివి పాలు బెల్లం నివేదన చేసి, కుటుంబం, దేశం, అన్నదాత క్షేమంగా ఉండాలి, మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి మంచి బుద్దిని ప్రసాదించు అని నమస్కారం చేసి, ఆత్మ ప్రదర్శన నమస్కారం చేసి హారతి ఇవ్వాలి.

శివలింగం ఉన్న వారు శివ శివా అంటూ కాసిన్ని నీరు రోజు అభిషేకం చేయాలి..అమ్మవారి పూజించే వారు కొద్దిగాచిన్న గ్లాస్ లొ రోజూ పానకం పెట్టాలి..వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో తీపి వండి నివేదించాలి, అప్పులు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు మంగళవారం పులిహోర నివేదించాలి..మంత్రాలు తంత్రాలు పుస్తకాలు వచ్చాక చదవండి మొదలు పెట్టారు ఒకప్పుడు సంస్కృతంలో సంకల్పాలు బ్రాహ్మణులు మటుకే చేసే వారు సాధారణంగా అందరూ ఇలాగే పూజలు చేసే వారు మీకు తెలిసిన భాషలో తప్పులు లేకుండా దేవుడితో మాట్లాడండి. భక్తి శ్రద్ద ముఖ్యం అంతే, అష్టోత్తరం, సహస్త్ర నామం తప్పులేకుండా ఓపికగా చదవ గలిగితే చదవండి లేదా శివ శివా, హర హర, రామ రామ కృష్ణ క్రిష్ణ అనుకుంటూ పూజ చేసుకుని రోజంతా ఏ పని చేసిన మనసులో నామ జపం చేసుకోండి , రోజులో ఎదో  ఒక సమయం ధ్యానం, పురాణం ఏదైనా కాసేపు చదవటం అలవాటు చేసుకోండి, ఇంట్లో గోడవలు ఉండకూడదు, ఇల్లు అశుబ్రంగా ఉండకుండా కలగా ఉండాలి..స్నానం భోజనం నిద్ర క్రమశిక్షణ ఉండాలి .ఇదే గొప్ప సాధన మంచి ఫలితాన్నిచే పూజ, కుదిరినంతలో ధాన ధర్మం చేస్తే అది దైవం స్వయంగా స్వీకరిస్తారు.





Post a Comment

0 Comments