Ad Code

కుబేర మంత్రం - Lord Kubera Mantra

కుబేర మంత్రం


కుబేర మంత్రం, యంత్రం తో సాధన విధానం ( ఆర్ధిక ఇబంధులు తొలగి ,ధన ప్రాప్తికి)

మంత్రం:
(ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ 
ధనధాన్య సమృద్ధిందేహీ రుద్రాయ స్వాహ)

రోజు దీపారాధన చేసి మీరు1 చేసే పూజ చేశాక ఈ ఫోటో లో చూపెట్టిన విధంగా మీరు దేవుడి దగ్గర ఒక పీట పైన గాని లేక ఒక అట్టపైన గాని గీసి ఈ అంకెలు ఇలాగే రాసి, పైన చెప్పిన కుబేర మంత్రం 108 సార్లు జపం చేయాలి. ఇలా 3 నెలలు వదలకుండా రోజూ చేయాలి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, కుబేరుడు చాలా ధర్మనిష్ఠ కలిగిన దైవం ఎవరైనా కొరని విధంగా కోరుకొని ఈ సాధన దుర్వినియోగం చేస్తే మీరు ఆయన దృష్టికి వెళ్లి శిక్షించ బడతారు, మీరు కోరుకునే సంపద న్యాయమైనది అయితే తప్పక మీమల్ని అనుగ్రహిస్తారు.

ధనం కి దేవత లక్ష్మీ అయినా అది పంచె బాధ్యత కుబేరుడిది. మీకు 108 టైమ్స్ జపం చేస్తే చాలు అని చెప్పాను. కానీ మీరు ఎంత ఎక్కువగా ఈ యంత్రం ముందు కూర్చుని జపం చేస్తే అంత త్వరగా మంచి ఫలితం వస్తుంది. గుర్తు పెట్టుకోండి విత్తనం వేయగానే చెట్టు రాదు పెళ్లి అయిన మరుసటి రోజే కొడుకు పుట్టడు. దైవం అనుగ్రహము తో పాటు మీకు అన్ని అనుకూలించే సమయం కూడా భగవంతుడు కలిపిస్తారు. నమ్మకం తో చేయండి ఇది ప్రయత్నం చేసి ఎంతో మంది సమస్యల నుండి బయట పడ్డారు. ఆర్థికంగా బాగుపడ్డారు శ్రీ మాత్రే నమః.

కుబేర పూజ 3 నెలల తర్వాత కూడా మీరు ఏ రోజు పుట్టారో ఆ రోజు ఏ నక్షత్రం రోజు పుట్టారో ఆ రోజు , ఇంకా ప్రతి సోమవారం శివుని కి పూజ చేసి , లేదా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి కి పూజ చేసి ఇలా యంత్రం వేసి చేయవచ్చు. ఆడవాళ్లకు ఆటంకం ఉన్నప్పు అపి మళ్ళీ 6 వ రోజు నుండి మొదలు పెట్టవచ్చు. కుబేరుడు చాలా సత్యవాక్కు,సౌమ్యంగా ఉండే వారు పరమ శివ భక్తుడు. ఈయనకు సూర్యోదయం కన్నా ముందుగా లేచి దీపారాధన చేస్తే చాలా ఇష్టం. బెల్లం తో చేసిన వంటలు ఇష్టం. అయితే కుబేరుడు ని కానీ హనుమంతుడి ని గాని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే వారిని యంత్రం లోనే పూజ చేయాలి. రోజు ముగ్గు వేయాల్సిన అవసరం లేదు ,ముగ్గులో రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక రాగి రేకు పైన ఇలా వేసుకోవచ్చు, లేదా ఒక అట్టలాగా  గట్టిగా ఉన్న దానిపైన కూడా పెన్ తో ఇలా రాసి రోజు అది పూజ ఐయ్యాక పూజలో నే ఉంచడం మంచిది ఇది ఉదయం సాయంత్రం కూడా చేసుకోవచ్చు.







Post a Comment

0 Comments