Ad Code

ముక్కుపుడక

ముక్కుపుడక



ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కుపుడక ధరించడం సంపంగిలాంటి ముక్కుకు కొత్త వింత అందాన్ని ఇస్తుంది. దీనిని ఎక్కువగాస్త్రీలు ధరిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
ముక్కెరను తమిళంలో మూక్కుత్తి, హిందీలో నాత్ లేదా నాథురి, బీహారీలో లాంగ్ అని పిలుస్తారు.

పురాణాలు:
సాంప్రదాయం సవరించు అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు. అందుకే  "మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక" అన్నాడో కవి. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.

భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి.

పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారు.





Post a Comment

0 Comments