Ad Code

పార్వతీ (త్ర్యక్షరి)

పార్వతీ (త్ర్యక్షరి)



ఇది మూడు అక్షరముల మంత్రము. పూజా సమయంలో “పార్వత్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

పార్వతీ - హిమవంతుని యొక్క పుత్రికయైనది శ్రీదేవి.

పర్వ - పూరణే అనే ధాతువు నుండి పర్వ - పర్వన్ శబ్దాలు జనించాయి. ఒక భాగాన్ని - ఒక విషయాన్ని పూర్తి చేస్తే దానిని పర్వము అంటారు. శుక్లపక్ష, కృష్ణపక్ష తిథులను పర్వములు అంటారు. ఈ తిథులు నక్షత్ర భాగాలను, చంద్రకళలను భాగాలుగా.విభజిస్తాయి. కనుక పర్వములు అనబడుతున్నాయి. మహాభారతము నందలి భాగాలను పర్వములు అంటారు. ఒక్క కథా భాగాన్ని పూర్తి చేస్తాయి కనుక వాటికి ఆదిపర్వము , సభాపర్వము ఇత్యాదిగా పేర్లు వచ్చినాయి.

ఇట్లు భాగాన్ని, ఒక విషయాన్ని పూర్తిచేసే దానిని పర్వము అంటారు.

"పర్వతః (పర్వాణి) అస్మిన్ సంతీతి పర్వతః” (విగ్రహవాక్యము).
పర్వతాలును అటులనే భూభాగాలను విభజిస్తాయి. హిమాలయపర్వతము తూర్పు సముద్రమునుండి పడమటి సముద్రమువరకు ఉంది. భారత దేశానికి పూర్వ, పశ్చిమముల కొలత కఱ్ఱగా ఉన్నది.

“అస్త్యుత్తర స్యాదిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజు"
పూర్వాపరౌ వారినిధీ విగ్రాహ్యస్థితః పృథివ్యా ఇవ మాన దండః.
(కుమారసంభవ ప్రధమసర శ్లోకః)
దాక్షాయణియై అహంకారంతో శివుడు పలదు అన్ననూ దక్ష యాగానికి పోయి శివనిందను భరింపలేక యోగాగ్నికి ఆహుతి అయింది. ఇది పూర్తిగా పర్వ గాథ. విడదీయరాని జంటగా ఉండేందుకే పర్వతరాజ పుత్రికగా అనగా పార్వతిగా జనించింది.

బాల్యం నుండి ఘోర తపం ఆచరించింది. శివుని అర్థాంగాన్ని స్వీకరించింది. ఇది రెండవదియైన పవిత్ర జీవిత పర్వగాథ. ఇట్లు శివశక్యై సూచకమైన పర్వమును బోధించేది పార్వతీ పదము.

ఈ పదంతో దేవిని అర్చించే వారు రాగద్వేష రహితులై శాంతిసౌఖ్యాలతో విరాజిల్లగలరు.


ఓం శ్రీ మాత్రేనమః





Post a Comment

0 Comments