Ad Code

పద్మరాగసమప్రభా (అష్టాక్షరి) - Ashtakshari

పద్మరాగసమప్రభా (అష్టాక్షరి)



ఇది ఎనిమిది అక్షరాల మంత్రం. పూజాకాలంలో “పద్మరాగ సమప్రభాయై నమః” అని ఉచ్చరించాలి.

పద్మరాగ సమప్రభా = పద్మరాగ మణులతో సమానమైన ఎఱ్ఱని శరీరకాంతి గలది శ్రీదేవి.

ఎఱుపు రంగు క్షాత్రగుణాన్ని సూచిస్తుంది. అమ్మవారు పద్మరాగ మణుల వంటి ఎఱ్ఱని కాంతిగలది అగుటచే సమస్త జగత్తుకు శాసకురాలు అని తెలియు చున్నది. శాసకులకు దయా, శక్తి, శిక్షణ, రక్షణ, సంపద, క్రోధము, ఐశ్వర్యము వంటివి అన్నియునూ ఉంటాయి. ఎవరియెడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తారు. అందుకనే ఆ తల్లిని “అరుణాం కరుణా తరంగితాక్షీం” ఇత్యాదిగా కీర్తిస్తారు. అరుణ వర్ణంతో క్షాతరూపంగా భాసించిననూ ఆ తల్లి భక్తులను కరుణా తరంగ దృష్టులతోనే చూస్తుంది.

ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి సమస్త బాధలు తొలగిపోతాయి. కరుణాతరంగ దృష్టులు ప్రాప్తిస్తాయి.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments