Ad Code

దేవుని నిత్యం ఎందుకు పూజించాలి? ఆహార పదార్ధాలు ఎందుకు నివేదించాలి?

దేవుని నిత్యం ఎందుకు పూజించాలి?
ఆహార పదార్ధాలు ఎందుకు నివేదించాలి?


ఒక యజమాని వంట వాడిని పిలిపించి వంట పదార్ధాలను సమకూర్చి ఇఛ్చి వంట చేసి తమకు వడ్డించి, తనను కూడా భుజించి పైకము తీసుకొని వెళ్ళమని చెప్పాడు అనుకుందాం. కానీ ఆ వంట చేసినతను పైకము తీసుకొని వంటచేసి తాను తినేసి, యజమానికి ఉంచకుండా, మిగిలిన ఆహార పదార్ధాలను తీసుకొని వెళితే, అతనిని కృతఘ్నుడు అని అంటాము కదా.

అలాగే ఈ సమస్త చరాచర జీవ లోకానికి యజమాని అయిన భగవంతుడు మనకు కాంతి ప్రసాదించే సూర్య, చంద్రులను, సమస్త ఆహార ధాన్యాలను, నీటిని, రోగమొస్తే ఔషధిని, ఇలా మనకు ప్రకృతి పరంగా ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కదా.

అటువంటి భగవంతుని యెడల కృతజ్ఞత కలిగి నిత్యం శ్లోకములతో, స్తోత్రములతో స్తుతించి ఆహార పదార్ధాలను భక్తి తో, శుచి శుభ్రతలతో వండి నివేదించాలి. అని మనకు శాస్త్రం నిర్దేశిస్తోంది, అందులో భాగం గానే మనం నిత్యం దేవుని పూజించాలి. దేవునికి ఆహార పదార్ధాలను నివేదించడం లో అంతరార్ధం ఆయన ఆరగిస్తాడని కాదు.

అతని చల్లని చూపు ప్రసరించిన నైవేద్యం మనం భుజిస్తే మనకు శక్తి రెట్టింపు అవుతుందని, అలాగే సమస్త మానవాళి కి ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్య దేవుని ప్రతి రోజు నమస్కరించి, ఆయనకు అర్ఘ్య ప్రదానం చేయాలి.


సర్వే జనఃసుఖినో భవంతు





Post a Comment

0 Comments