Ad Code

గోమాతను ఎందుకు పూజిస్తారో తెలుసా? - Why Cows Are Worship In Hindu Religion


గోమాతను ఎందుకు పూజిస్తారో తెలుసా?




ముఖ్యంగా చిన్నచిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో వుండేవారు గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. ఎందుకంటే వీటి ద్వారే వారి జీవన విధానం కొనసాగుతుంది. ఆవు ఇచ్చే పాలతో వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. దీంతో వారు వీటిని ఎంతో దైవంగా భావిండచమే కాకుండా కొన్ని ప్రత్యేకరోజుల్లో పూజలను కూడా నిర్వహిస్తారు. అయితే కొంతమంది మాత్రం వీటిని పాలిస్తున్న జంతువుల్లాగా భావిస్తారు.

ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూంగా వర్ణించడం జరిగింది. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించిపోతాయని పురాతనకాలం నుంచే ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూ వస్తున్నారు. గోవు పాదాలలో ఋణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు కలవారున్నారు.

అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ - ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ - ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు.


గోమాత గురించి కొన్ని నిజాలు:

ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని, ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని.

ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab)కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు, ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science) కు పంపి పరీక్షించారు.

ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ, మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి. 
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?

గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.

మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా !
అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా

గోవు కూడా జంతువే కానీ
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకున్నాయి .

అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.





Post a Comment

0 Comments