Ad Code

యజ్ఞాలు - The Vedic Yagna or Yagam

యజ్ఞాలు



ఆరు రకాల యజ్ఞాలు

ద్రవ్యయజ్ఞం: ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలి.

తాపయజ్ఞం: జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం.

స్వాధ్యాయయజ్ఞం: ఏ విద్యనైనా సరే, కేవలం అధ్యయనం చేయటమే కాకుండా, అర్థం చేసుకుని లోక కల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం.

యోగయజ్ఞం: యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం.

జ్ఞానయజ్ఞం: మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి? అని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం.

సంశితయజ్ఞం: తనలోని కామక్రోధ మద మాత్సర్యాలను జయించి, నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం.





Post a Comment

0 Comments