Ad Code

మహాతంత్రా (చతురక్షరి) - Chaturakshari

మహాతంత్రా (చతురక్షరి)




ఇది నాల్గు అక్షరాల మంత్రము. అర్చనా సమయంలో “మహాతంతాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

మహత్ + తంత్రం = యస్యాః సా మహాతంత్రా = మహిమాన్వితమైన తంత్ర స్వరూపిణియైనది శ్రీదేవి.

"సర్వతన స్వరూపా” అని వెనుక మంత్ర విచారణ సందర్భమున, తంత్ర శబ్ద విచారము కొంత చేయబడింది.

తంత్ర శాస్త్రాలు కాది విద్యాతంత్రాలు, హాది విద్యాతంత్రాలు అని ముఖ్యంగా రెండు విధాలుగా ఉన్నాయి. హాది విద్వాతం తాలు కొన్ని సిద్ధులను గల్గించి సాధకుడిలో అహంకారాన్ని వృద్ది చేస్తాయి. తుదకు సాధకుణ్ణి భోగ లాలసుడిని గావించి భ్రష్టుణ్ణి గావిస్తాయి. శ్రీదేవి కాది విద్యా తన్త మానమైనది. సాధకుడిలో అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఆత్మానుభూతిని, బ్రహ్మానుభూతినీ గల్గిస్తుంది. అందుచే ఆ తల్లి మహాతంత్రమైనది.

తను విస్తారే తప్త. సంక్షేపే అనే రెండు ధాతువులనుండి తంత్ర శబ్దము నిష్పన్న మైనది అని వైయాకరణులు అందురు. ఈ నిర్వచనాలను అనుసరించి శ్రీదేవి వలననే అనులోమ క్రమంగా, ఆకాశాది రూపంగా సమస్త ప్రపంచము విస్తరించుచున్నది. ఈ విస్తారత అనేది పరాకాష్ఠ నందగానే ప్రతిదానిలోనూ, క్రమంగా వచ్చినది వచ్చినట్లు కుంచించుకుపోతుంది. చివరకు ఒక చిన్న బిందువుగా మిగులుతుంది. దీనిని బోధించేదియే శ్రీచక్ర బిందువు.

"ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః
విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూ”

లలితా సహస్రనామ మంత్రాలు ఈ విషయాన్నే బోధిస్తున్నాయి.

శ్రీచక్రంలో తొమ్మిది చక్రాలు ఉన్నాయి. ప్రతి చక్రానికి దేవతలు, గణము, స్వరూపం, మంత్ర, యంత్ర, పూజ, స్తోత, కవచములు కలవు. ఈ దేవతాదులును మధ్యనుండే బిందువులో చివరకు సంక్షిప్తతను పొందుతారు.

తాంత్రికములో ముఖ్యంగా మూడు భేదాలు గలవు.
(1) సమయాచారము
(2) కౌళ మార్గము
(3) మిశ్రమము.
ఇందులో సమయాచారము - సర్వోత్తమము, కౌళము - స్వార్థపూర్ణము.

మిశ్రమము - మధ్యమమైనది. సనక, సనందన, సనత్కుమార, శుక, వశిష్ఠాది సంహితలు.

ఉపనిషత్తులలో భావనోపనిషత్తు మొదలైనవి తంత్రవిద్య సంబంధమైనవి. వైదికముగా సంకల్పము మొదలుకొని ఉండే ఆచరణ సముదాయము అంతయును తంత్రమే అగును.

పరమేశ్వరి వేదస్వరూపిణీ. సర్వతంత్ర స్వరూపిణీ అగును. అందుచే అమ్మను ఉపాసించే వారికి సృష్టి అంతయూ అమ్మ తంత్ర స్వరూపమే అని అవగతం అగును. అందుచే రాగద్వేషాదులు అంతరిస్తాయి. క్రమంగా తీవ్ర సాధనచే ఆత్మానుభూతియు, బ్రహ్మానుభూతియు గల్గుతాయి. సాధకుడు జన్మసార్థకతను పొందును.

ఈ మంత్రంచే శ్రీదేవిని ఉపాసించే సాధకులకు క్రమంగా, సమస్త సృష్టియు అమ్మ రూపంగా గోచరిస్తుంది. తాంత్రికమైన కొన్ని సిద్ధులును ప్రాప్తిస్తాయి. ఐహిక, ఆముష్మిక శుభాలు పొంది తరిస్తారు.

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments