Ad Code

చతుష్టష్టికళామయీ (అష్టాక్షరి) - Ashtakshari


చతుష్టష్టికళామయీ (అష్టాక్షరి)



ఇది అష్టాక్షరములు గల్గిన మంత్రము. పూజాసమయంలో “చతుష్టష్టి కళామయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

చతుష్టష్టి - కళామయీ = అరువదినాలుగు కళలు స్వరూపంగా గలది శ్రీదేవి.
సంగీతము, కవిత్వము, గీతము, నృత్యము, నృత్య వాద్యము మొదలైన అరువది
నాలుగు కళలు దేవీ రూపములు అని సామాన్య భావము.

కళ అనగా ఆనందాన్ని కల్గించేది. ఇందులో సంగీత నృత్యాదులు అపాత మధురములు..అనగా ఆబాలగోపాలము మానవులకే గాక, పశుపక్ష్యాదులకు ఆనందాన్ని కల్గించేవియై ఉంటాయి. అందుచేతనే
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణీ” అని విజ్ఞులు అన్నారు.

ఏమి తెలియని శిశువు, పశువు, కాలసర్పము సైతము మధురగాన శ్రవణంచే ఆనందాన్ని.పొందుతూ ఉన్నవి. ఇటువంటి కళలు అరువది నాలుగు. అలాంటి కళాస్వరూపిణి లేక అటువంటి కళలచే ఆరాధింపబడేది శ్రీదేవి అనిభావము. ఆరాధ్య, ఆరాధ్య సాధనములు అభేదము అనే న్యాయాన్ని బట్టి కళారాధ్యయైన దేవి కళారూపిణిగా కీర్తింపబడింది.

చతుష్టష్టి కళల విషయంలో తమ తమ పాండిత్యాన్ని అనుసరించి బహుదా వ్యాఖ్యానిస్తారు.
జ్ఞానేంద్రియాలు - 5
కర్మేంద్రియాలు - 5
ప్రాణవాయువులు - 5

మనస్సు ఇవి అన్నియు సూక్ష్మ శరీరం అగును. ఇది షోడశకళా రూపమైనది. ప్రాతః సంధ్య, మధ్యాహ్న, సంధ్య, సాయం సంధ్య, అర్థరాత్రి సంధ్య, ఇలా నాల్గు సంధ్యలచే
పుర్యోక్తమైన షోడశ చిత్కళలను గుణించినచో 16 X 4 = 64 అగును. ఇలా చిత్కళా చతుష్టష్టిచే ఆరాధనీయ శ్రీదేవి అందురు.

సర్వేంద్రియములతో నాల్గు సంధ్యలందు సేవింపదగినది అని సారాంశము. ఇది ఒక విధమైన సమన్వయము ఉప - చారము = సమీపమునందు చరించుట. పూర్వ పదాన్ని 16
కళలు ఏర్పడు చున్నవి (16 వృద్ధి కళలు - 16 క్షీణ కళలు) వీటిని ప్రాతఃసంధ్య, మధ్యాహ్నసంధ్య, సాయంసంధ్య, అర్థరాత్రి సంధ్య, అనే నాల్గింటితో గుణించినచో 16 X 4 = 64 అగును. చంద్రుడు మనస్సునకు సంకేతము “చంద్రమా మానసో జాతః" అని శ్రుతి.
ఇలా చతుష్టష్టి కళలచే ఆరాధనీయ శ్రీదేవి అని సమన్వయిస్తారు. ఇందులో సర్వేంద్రియాల ఏకాగ్రతా రూపమైన చిత్కళా సమన్వయము కొంత శుభంగానే ఉంది. ఇతర సమన్వయాలు అన్నియును పాండిత్య ప్రకర్షను బోధించేవియే గాని సాధకులకు అంతగా ఉపయోగపడవు. సంగీత నృత్యాది కళలను మాత్రం అందరునూ ఎఱుగుదురు. అందుచేత ఈ రెండు విధములు సమన్యయాలు సాధకులకు బాగుగా వర్తిస్తాయి. ఈ రెండిటినీ సమన్వయం సైతం చేయవచ్చు.
సర్వేంద్రియాల ఏకాగ్రతతో దేవిని మధురంగా కీర్తించడం, నృత్యం చేయడం వంటి ఆరాధనలను మనం సర్వత్రా దేవీ మందిరాలలో చూస్తూనే ఉన్నాము. సంగీత, నృత్య, వాద్య,
కవితాదులను కొందరు కళలు అందురు. ఇక కొందరు వేదశాస్తాది విద్యలను 64 కళలుగా.పేర్కొందురు. ఈ సృష్టిలో సర్వము అమ్మ రూపమే గనుక అలా పేర్కొనడంలో దోషం లేదు.

ఈ మంత్రంతో శ్రీదేవిని ఉపాసించే వారికి సర్వవిద్యలు, కళలు అనాయాసంగా ప్రాప్తిస్తాయి.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments