Ad Code

ఉగాది పండగ విశిష్టత - Ugadi Festival


ఉగాది పండగ విశిష్టత


ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతిఒక్కరు ఉగాది పచ్చడిని తయారుచేసుకుంటారు. ఇది షడ్రుచులైన తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు వంటి పదార్థాల సమ్మేళనంతో తయారుచేస్తారు. ఈ ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా ఉగాది పండుగరోజే తయారచేసుకుంటారు. 

ఉగాదిరోజు నుండి సంవత్సరం మొత్తం జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, మంచిచెడులను స్వీకరించాలనే సందేశంతోనే పచ్చడిని తయారుచేస్తారు. అరటిపళ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చెరకు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి పదార్థాలతో ఈ పచ్చడిని తయారుచేస్తారు. 

హిందూ శాస్త్రాలప్రకారం ఈ ఉగాది పచ్చడిని ‘‘నింబ కుసుమ భక్షణం’’, ‘‘అశోక కళికా ప్రాశనం’’ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఋతువుల మధ్య మార్పిడుల వల్ల వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను నివారించే ఔషదంగా ఉగాది పచ్చని ప్రాచీనకాలం నుండే ఆరంభమైన ఆచారమని అంటారు. 

శాస్త్రీయపరంగా చెప్పుకోవాలంటే ఉగాది పర్వదినం మొదలయ్యే రోజు నుండి అంటే చైత్రమాసంలో భూమి, సూర్యుడికి చాలా దగ్గరగా వెళతాడు. ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడే వేడితాపం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి హాని కలిగించేవిగా వుంటాయి. ఈ వేడిని నివారించడానికి పచ్చడిలో వుండే బెల్లం, వేపపూత ఎంతో తోడ్పడుతాయని అంటారు. 

ఉగస్య ఆది ఉగాది:-"ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:- చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది చరిత్ర:
వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

ఉగాది రోజు చేయవలసని 5 పనులు:
1. తైలాభ్యంగనం
2. నూతన సంవత్సరాది స్తోత్రం
3. నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
5. పంచాంగ శ్రవణం

1. తైలాభ్యంగనం:
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. "అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం" (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

2. నూతన సంవత్సర స్తోత్రం:
అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

3. ఉగాది పచ్చడి సేవనం:
ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాం. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

4. పూర్ణ కుంభదానం:
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.

ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:
అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:

యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

5. పంచాంగ శ్రవణం:
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం" అనెడి పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకంలో ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది.

అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

కాలవిత్కర్మకృద్ధీమాన్‌ దేవతానుగ్రహం లభేత్ - అంటూ తిథి శ్రేయస్సును, వారం ఆయుష్షును, నక్షత్రం పాప నివారణను, యోగం, రోగనివారణను, కరణ కార్యసిద్ధిని కలిగిస్తాయి. బ్రహ్మాయుర్ధాయాన్ని మనం నిత్యం స్మరిస్తూనే ఉంటాం. అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్ధే... శ్వేతవరాహకల్పే, నైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, అస్మిన్‌ వర్తమానేన వ్యవహారీక చంద్రమానేన స్వస్తిశ్రీ జయ నామ సంవతస్సరే, చైత్రమాసే, శుక్షపక్షే, ప్రతిపద్యాం, ఇందువాసరే... ఈ వైవస్వత మన్వంతరంలో 27మహాయుగాలు గడిచిన తరువాత 28వ మహాయుగంలో కలియుగంలో ఇప్పటికి 5114 సంవతర్సరాలు గడిచి ప్రస్తుతం 5115 వ సంవత్సరంలో ఉన్నాం.


The festival of Ugadi marks the beginning of the New Year for those living between Kaveri River and Vindhyas and those who follow the lunar calendar of South India particularly in the states of Karnataka, Andhra Pradesh and Maharashtra. The calendar dates back to the Shalivahana era which is supposed to have been built by the great legend Shalivahana. The king Shalivahana was also referred to as Gautamiputra Satakarni is responsible for initiating the era of Shalivahana.

The Lunar calendars have a cycle of sixty years and a New Year starts on the day of Yugadi on Chaitra Sudhdha Paadyami. After the completion of every sixty year the calendar starts with a fresh New Year. During the festival the season of spring is believed to have arrived at its fullest and every where the colours of festivals can be seen. New leaves budding on the trees look amazingly beautiful and utmost zeal and excitement can been seen in the hearts of people celebrating Ugadi. Though, Lord Shiva had cursed Lord Brahma that he will not be worshipped ever but in Andhra Pradesh this festival of Ugadi is specifically celebrated in honour of Lord Brahma. As per the ancient tales, it is believed that Lord Vishnu had taken the form of Matsya. On the day of Ugadi people clean their house and the nearby area and decorate the entrance of their house with mango leaves. And also people buy new clothes for them and for their family members.

Ugadi is a festival which involves various rituals and customs. On this day, the people of Karnataka and Andhra Pradesh celebrate their New Year with much devotion and enthusiasm.The day is filled with joy and happiness and one can find social gatherings which are an integral part of the celebration. People pray to God for prosperity and happiness in their life. The day is very holy and people believe that, you are sure to get success, if you venture into new things on this day. The celebration is marked by not only social merriment but also by religious spirit.

Apart from performing puja, in the morning there are other special rituals of this day. One such ritual is preparing a dish called UgadiPachadi, which is a mixture of all kinds of taste. This dish symbolises life which is a mixture of emotions. In Karnataka, raw mango is used to make holige and puliogure and similar dishes like pulihora and bobbatlu are prepared in Andhra Pradesh. In Maharashtra, people make puranpoli which is a sweet roti.

Another custom is to listen to KaviSammelanam where poetry is recited by the people. It is typical to Telugu community. People indulge themselves in literary feast as many new poets are given chance to showcase their talents.

Due to all this variety, Ugadi is considered as a festival with many shades. It marks the beginning and fills the life of everyone with joy and happiness.


Post a Comment

0 Comments