Ad Code

Ganapathi Suprabhatham (గణపతి సుప్రభాతం)


గణపతి సు
ప్రభాతం





శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే  ||1||

శ్రీకరా! శుభకర! దేవ! శ్రీ గణేశ !
అభయమిడి మమ్ము రక్షించి శుభము గూర్ప
మేలుకో గౌరీ వరపుత్ర! మేలుకొనుము
సుప్రభాతము నీకిదే శుభ గణేశ!  ||2||

సర్వసిద్ధి ప్రదాయక ! సర్వనేత్రా !
సర్వలోకాధినాయకా ! సకల పూజ్యా !
ఆలసింపక మేలుకో అమలరూప
సుప్రభాతము నీకిదే శుభ గణేశా !  ||3||

తూర్పుదిశలోన భానుడు తొంగిచూడు
దిక్కులన్నియు నీ ఖ్యాతి తెలుపుచుండె
మేలుకొను విఘ్నరాజ మమ్మేలుకొనగ
సుప్రభాతము నీకిదే శుభ గణేశ !  ||4||

లేచి నిను జూడ కనులార వేచినాము
కరుణ కురిపించి మమ్మింక కావవయ్య
జాగుసేయక లేవయ్య జగములేల
సుప్రభాతము నీకిదే శుభ గణేశ !  ||5||




Post a Comment

0 Comments