Ad Code

కరోనా వైరస్ వ్యాపించకుండా, శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనంను తాత్కాలిక నిలిపివేత


కరోనా వైరస్ వ్యాపించకుండా,
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనంను తాత్కలిక నిలిపివేత




కలియుగవైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామికి కూడా కరోనా వైరస్ భయం తప్పలేదు. శ్రీవారి నివాసమైన ఏడు కొండలు ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాపించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంలో భాగంగా, శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి మూలవిరాట్టుకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది.

తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అదనపు ఈఓ ఎ.వి.దర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాలు పటిష్ట చర్యలు చేపట్టింది.

అలాగే, తిరుమల ఘాట్‌రోడ్లను కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ప్రకటించారు. అలిపిరి గరుడ సర్కిల్‌ నుంచి వచ్చే భక్తులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఎగువ ఘాట్‌ రోడ్డుపైకి వాహనాలు వెళ్లకుండా అధికారులు నిలిపివేస్తున్నారు.


కొండ పైనుంచి వాహనాలను కిందకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలన్నీ కిందకు వచ్చాక దిగువ ఘాట్‌ రోడ్డును కూడా మూసేయనున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్లు కాలినడక మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఘాట్‌ రోడ్లను మూసివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.



సర్వేజన సుఖినొభవంతు

Post a Comment

0 Comments