Ad Code

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు - Dvadasha Jyotirlinga Darshan


ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు


పరమశివుడు భక్తుల శ్రేయస్సును మదిలోనెంచి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రకటితుడైనాడు.

1. సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం,
2. శ్రీశైలంలో మల్లికార్జున,
3. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం,
4. ఓంకారేశ్వర లింగం,
5. కేదారేశ్వర లింగం,
6. భీమేశ్వర జ్యోతిర్లింగం,
7. కాశీలో శ్రీ విశే్వశ్వర లింగం,
8. త్య్రంబకేశ్వర లింగం,
9. వైద్యనాథేశ్వర లింగం,
10. దారుకవనంలో శ్రీనాగేశ్వర లింగం,
11. శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం,
12. ఘుశే్మశ్వర జ్యోతిర్లింగం.


ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం.

ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర అద్భుతం. మహనీయం. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం - నిత్యస్మరణం భవసాగర తరుణోపాయం, ముక్తిదాయకం. పరమేశ్వరుని అనుగ్రహపాత్రం. ఒక్కొక్క జ్యోతిర్లింగావిర్భావం ఒక్కో అద్భుత ఘట్టం.

1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి. 

7 . సర్వప్రపంచం చేత సేవించ బడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

12 ఘృష్ణేశ్వరుడు శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇలను అందజేస్తుంది.




ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఒక్కో రాశికి ఒక్కోలింగం:


దేశంలోని శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు. ఈ ఆలయాలను కొన్ని శతాబ్దాల కిందటే నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు వీటిని దేవతలే నిర్మించారని హిందువులు బలంగా విశ్వసిస్తాయి. అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు రాశి చక్రంలోని ఒక్కో రాశితో ముడిపడి ఉన్నాయి. అందుకే తమ రాశికి చెందిన ఆలయాన్ని దర్శించడం, శ్లోకాలను పాటించి దోషాలు తొలగి తప్పక మంచి జరుగుతుంది.

మేషరాశి కుజుడికి స్వగృహం. ఇది చరరాశి. కాబట్టి వీరికి పదకొండ ఇంట శని బాధకుడు. గ్రహపీడనా నివారణార్థం ఈ రాశివారు రామేశ్వరాన్ని దర్శించి, ‘సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యే శ్రీరామ చంద్రేన సమర్పితం, రామేశ్వరాఖ్యం నియతం నమామి’ అనే శ్లోకం రోజూ పఠించాలి. శని దోష నివారణార్థం శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

వృషభరాశి అధిపతి శుక్రుడు, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయాన్ని దర్శించి, ‘సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని రోజూ ఉచ్చరించడం శుభం. వీళ్లు తమ జన్మ నక్షత్రంలో సోమనాథ్‌లో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

మిథునరాశి, ఇది బుధునికి నివాస స్థలం. ఈ రాశివారు గ్రహదోష పరిహారార్థం నాగేశ్వర క్షేత్రాన్ని దర్శించాలి., రోజూ ‘యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ రాశిలో శని సంచరించేటప్పుడు కైలాస యంత్ర ప్రస్తార మహాలింగార్చన చేయిస్తే విశేష ఫలితం ఉంటుంది.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అందుకే ఓంకారేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుంది. అలాగే నిత్యం ‘కావేరికా నర్మదాయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓంకార మీశం శివమే మీధ్యే’ అనే శ్లోకం పఠించాలి. జన్మనక్షత్రం ఉన్న రోజున ఓంకార బీజాక్షరం జపించడం అత్యంత శుభకరం.

సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు ఘృష్ణేశ్వర జ్యోతిర్లిగం దర్శించడం మంచిది. ‘ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుంచి విముక్తి కలుగుతుంది.

కన్య రాశికి అధిపతి బుధుడు. అన్నిరకాల బాధల నుంచి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జునుని దర్శించి, భ్రమరాంబకు కుంకుమ సమర్పించాలి. జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. ‘శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం’ అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తుల రాశికి అధిపతి శుక్రుడు. మహాకాళేశ్వర దర్శనంతోపాటు శుక్రవారం సూర్యోదయ సమయంలో ‘ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం’ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారు.

వృశ్చిక రాశికి అంగారకుడు (కుజుడు) అధిపతి. ఈ రాశివారు వైద్య వృత్తిలో రాణిస్తారు. వైద్యనాథేశ్వరుని దర్శించడం, ప్రతి మంగళవారం ‘పూర్వోత్తరె ప్రజ్వాలికాని ధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం తమహం నమామి’ అనే శ్లోకాన్ని పఠిస్తే శుభం జరుగుతుంది.

ధనుస్సు రాశికి అధిపతి బృహ‌స్పతి. ‘సానందవనే వసంతం.. ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేయాలి. వారణాసిని దర్శించి, గురువారం నాడు శనగల దానం ఇవ్వడం వల్ల శని, గురు గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చు.

మకర రాశికి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ దశకు కారణమవుతుంది. ఈ రాశివారు భీమశంకర దర్శనం వల్ల తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ‘యం ఢాకినీ శాకిని కాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి’ అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం, దివ్యాంగులు, ముసలివారికి వస్త్ర దానం వల్ల మంచి జరుగుతుంది.

కుంభరాశికి అధిపతి వరుణుడు. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తి కోసం ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం చేసుకోవాలి. ‘నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే’ అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి. శనివారం రుద్రాభిషేకం జరిపిస్తే మంచిది.

మీనరాశికి అధిపతి ఇంద్రుడు. త్రయంబకేశ్వర లింగం ఎప్పుడూ నీటిలో ఉంటుంది. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం వల్ల మేలు జరుగుతాయి. ‘నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే’ అనే శ్లోకాన్ని పారాయణం చేయడం సకల శుభాలను కలిగిస్తుంది.



12 Jyotir Linga:

1. The Somnath temple is dedicated to Someshwara, another name of Lord Shiva with moon on his head. The temple is situated in Saurashtra in a place called Prabhas Pattan near the port of Veravel. It is believed that the Moon God himself had originally built the temple out of gold. Somnath is the first of all the 12 jyotirlingas. The Somnath temple has been destroyed six times and has been rebuilt. Last time it was after independence. The temple faces the east direction.

2. The Sri Shailam Temple located in Kurnool district. Sri Shailam is a small city situated in the densely forested Nallamalai hills. This temple is considered very holy and is dedicated to Mallikarjuna Swamy and Bhramaramba. One unique feature of the temple is that all the devotees who visit the temple are allowed to touch the idol which is not prevalent in any other temple in South India. According to popular legends, Adhi Shankara had composed his famous Sivananda Lahiri here It is also believed that Goddess Durga had taken the form of a bee and worshiped Lord Shiva here and selected this holy place as her abode.

3. Mahakaleshwar Jyotirlinga Temple is situated in Ujjain, the historical capital of Central India. This Temple is situated near a lake. The idol in the temple is known as Dakshinamurti, facing the south and is white in colour. Among the 12 Jyotirlingas, the Mahakal Jyotirlinga is believed to be swayambhu, meaning born of itself. The Mahakaleshwar temple is made in five levels, one of which is underground. The underground sanctum is lightened by brass lamps. The prasada in the temple can be re-offered unlike other temples. According to the legends, a demon called Dushana tormented the people of Avanti and then Lord Shiva appeared from the ground and rescued the people and then on the request of the people, Lord Shiva permanently settled there as Mahakaleshwar Jyotirlinga.

4. Lord Omkareshwara or Amaleshwara temple is located in an island on the banks of the Narmada, is located on the Mandhata hill in Madhya Pradesh. The Omkareshwar Jyotirlinga shrine and the Amareshwar temple is one of the 12 revered Jyotirlinga shrines of Shiva. The river Narmada branches into two which forms an island Mandhata or Shivapuri in the center. Ironically, the island's shape resembles the visual representation of the Omkara sound, Om. The temple can be reached by ferry. As per the legend, Vindhya mountain once prayed to Lord Shiva or Omkareshwara and got blessed in return. Other story says that the Shivalinga was split into two upon the request of the Devas. Thus, the formation of Omkareshwara and Amareshwar.

5. Vaidhyanath is located at Deogarh in the Santal Parganas area of Bihar. Deogarh is also known as Vaidyanath. The temple faces the east. The top of the Shiva Lingam is slightly broken which as per the legend happened when Ravana tried to uproot it. Sivaganga lake is positioned just near the temple. While the Chandrakoopa well found near the main entrance is said to have been filled with water by Ravana from several thirthams. The Shiva's temple is almost 72 feet tall in the form of a lotus. There are three ascending shaped gold vessels on the top. Then there is a Punchsula as well as an eight petalled lotus jewel called Chandrakanta Mani. According to mythology, Ravana meditated hard to invoke Lord Shiva. In his desire to become invincible, he attempted to lift Lord Shiva's abode, Mount Kailash. The act offended the Lord. He punished him but with Ravana pleading for mercy, he left him on one condition. He gave him one of the twelve lingas which were not supposed to be kept on ground in any case. But Ravana's promise gave way in front of nature's call & kept the linga on the ground. In order to rectify the mistake, Ravana started cutting off nine of his heads as a part of his repentance. Shiva was pleased by this & he joined the heads again to the body. Worshipping Vaidhyanath Jyotirlinga is considered to eliminate one's all worries and miseries. It even imparts salvation.

6. Jyotirlinga Nageswar. The temple is located between Dwarka and Dwarka Island in Gujarat on the coast of Surat. The Jyotirlinga in the temple is known as Nageshwar Mahadev. The temple is being visited by thousands of pilgrims every year. The Jyotirlinga situated in the temple is considered to protect everybody from all sorts of poisons. It is believed that one who offers prayers in the temple becomes poison free.
Nageswaram Naganatham Nagabrana booshidham Nataka-pradham Navarasa Pradham Jyodhir-Swaroopam Vandhe Namami.

7. Kedarnath is a Hindu holy town located in the Indian state of Uttaranchal. And is the northern most Jyothirlinga. The place is located at an altitude of 3,584 m and at the origin of the river Mandakini, The place is accessible after a steep 13 km trek over a paved path from Gaurikund. Rishikesh, Haridwar, The credit for the construction of this heavenly temple is given to the Pandavas. According to the saying it is believed that the Pandavas came to Lord Shiva to seek blessings to atone their sins after the battle of Mahabharata. Lord Shiva evaded them continuously and took refuge in Kedarnath in the form of a Bull. On being chased, Lord Shiva left his hump behind. This conical protrusion is worshiped in the temple. The temple is located on the Rudra Himalaya range, also known as the Pancha Parvata. It is believed that four of the Pandavas died on one of the peaks, Swargarohini.

8. Tryambakeshwar is one of the 12 Jyotirlinga shrines situated 30 km from Nasik in Maharashtra. Considered to be the birth place of the river Godavari, the shrine's beauty is still well intact. A small Shivalingam or Tryambaka, is placed amidst a spacious courtyard & the sanctum which is crowned with a graceful tower, a giant amalaka (goose berry) and a golden kalasha. The Shivalingam is situated in a depression on the floor of the sanctum. Continuous flow of water from the top of the Shivalingam adds to the mystic beauty. Shivalingam is generally covered with a silver mask which is then substituted with a golden mask with five faces on festive occasions. These faces have their respective golden crowns. While, the silver mask is similar to the processional images seen in South Indian temples.

9. The Rameshwar Jyotirlinga is considered as the southern most Jyotirlingams of India. According to belief, it was installed there by Lord Rama after his return from Sri Lanka. Since Ravana was a Brahmin, Rama got Brahma hathi dosha and to get rid of it, he installed and worshipped Shiva. The Lord is known as Ramanatha. The temple is situated on an island located on the south eastern coast of Tamil nadu. It is believed that the ancient shrine was a thatched hut till it was rebuilt in the 12th century by Parakrama Bahu of Sri Lanka. The rest of the temple was completed by the Sethupathy rulers of Ramanathapuram. There are 36 Theerthams meaning water springs in Rameshwaram out of which 22 are situated in the temple.

10. Jyotir Linga Bhimashankar, Sahyadri Hills. This temple is located near Pune of Maharashtra on the shores of river Bhima. And is located on a high peak, surrounded by thick dense forests. The shrine Bhimashankaram, dates back to the 13th century. Lord Shiva's killing of the demon Tripurasura is the main legend associated with the temple. It even states that Shiva took abode on the Sahyadri hills in the form of a Bhima upon the request of the Gods, on the crest of the Sahyadri hills. The sweat of Shiva poured after the battle ultimately led to the origin of Bhimarathi river.

11. Kasi Vishwanath. This temple holiest of the holies to any Hindu is situated in the banks of the holy river Ganga in Varanasi. The temple has been destroyed several times by invaders but has been rebuilt every time. It is believed the priests of the temple have sacrificed their all several times to preserve the holy Lingam. The present temple has been built by Ahalyabhai, a Maharashtrian queen.

12. The Grishneshwar Jyotirlinga Temple is one of the ancient and holiest shrines of India.. The temple is located at a distance of 11km from Daulatabad near Aurangabad in Maharashtra. Daulatabad was once known as Devagiri. Ahilyabhai Holkar constructed the Grishneshwar Temple. Grishneshwar is also known as Ghushmeswara. According to legend, a devotee called Kusuma worshiped Lord Shiva by immersing a Shivalingam everyday in a nearby tank. Kusuma's husband's first wife out of jealousy because of Kusuma's piety in the society killed her son. An aggrieved Kusuma continued her daily ritual and when she dipped the Shivlingam in the tank her son miraculously revived. From then on the people started worshiping Lord Shiva in the form of a Jyotirlinga Ghusmeshwar.


Post a Comment

0 Comments