Ad Code

ఔన్డా నాగనాథ్ దేవాలయం - Aundha Naganatha Temple


ఔన్డా నాగనాథ్ దేవాలయం, హింగోళి,మహారాష్ట్ర.




ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8 వది గా చెప్తారు.
ఒక లెక్కలో చూస్తే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రాదు.

దాని వివరణ ఏంటంటే

అసలు 12 జ్యోతిర్లింగాలు ఏవో తెలుసుకుంటే

గుజరాత్ లోని సోమనాధ్,
ఆంద్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లిఖార్జున,
మధ్య ప్రదేశ్ మహా కాళేశ్వరం,
మధ్య ప్రదేశ్ మమలేశ్వరం,
మహారాష్ట్ర వైద్యనాధ్,
మహారాష్ట్ర భీమశంకరం,
సేతు బందేతు రామేశం
నాగేశం దారుకావనే,
వారణాసి విశ్వేశం,
త్రయంబకం గౌతమీ తటే,
హిమాలయెతు కేదారం,
ఘృష్ణేశంతు శివాలయే.

దీనిని దేవగిరి యాదవ రాజులు 13 వ శతాబ్దంలో నిర్మించారు.మహాభారతం లోని ధర్మరాజు, పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు దీనిని నిర్మించారు అని ఇదే ఆ ప్రాంతంలో మొదటి దేవాలయం అని స్థల పురాణం చెప్తుంది. ఔరంగజీబ్ దీనిని ద్వంసం చేయకముందు ఇది 5 అంతస్థుల్లో ఉండేది అని తెలుస్తుంది.

ఇది 60 అడుగుల ఎత్తుతో , 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం దేవాలయం ఏరియా దాదాపు 60,000 చదరపు అడుగులు ఉంది.
ఇది ఒక దేవాలయం అనే విషయం పక్కన పెట్టి చూస్తే దీని అద్భుత శిల్ప సౌందర్యం నమ్మశక్యం కాకుండా చేస్తుంది.

క్షేత్రానికి వెళ్లాలంటే మొదలు ఔరంగాబాద్ నుండి పర్లికి వెళ్ళి వైద్యనాధ్ ను చూశాక,అక్కడినుండి పర్భని కి వెళ్ళాలి,బస్ సౌకర్యం వుంటుంది. పర్భని నుండి జీప్ లలో వెళ్ళాలి బస్ వుండదు, 72 కిలోమీటర్లు వస్తుంది.


Details of outer wall, Aundha Naganatha Temple, Hingoli(Maharashtra)

Aundha Nagnath is the eighth of the twelve Jyotirlingas, it is an important place of pilgrimage.The present temple is said to have been built by Yadavas of devagiri and dates to 13th century.The first temple is said to be from time of Mahabharata and is believed to have been constructed by Yudhishthira, eldest of Pandava, when they were expelled for 14 years from Hastinapur. It has been stated that this temple building was of seven-storyed before it was ransacked by Aurangzeb.

The temple covers an area of 7200 sq ft and height of 60 ft. The total area in which temple campus is spread is about 60,000 sq. ft. Apart from the religious significance, the temple itself is worth seeing for its unbelievably beautiful carvings.




Post a Comment

0 Comments